హైదరాబాద్ లో కాల్పుల కలకలం..

హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. కోఠి బ్యాంక్ స్ట్రీట్ లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 7 గంటలకు రషీద్ అనే వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. అతడిని వెంబడించిన దుండగులు.. కాల్పులు జరిపి రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ కాల్పుల్లో రషీద్ కాలికి గాయమైంది. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.కాల్పుల ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎవరు, ఎంతమంది ఉన్నారనే వివరాల కోసం స్థానికులను విచారిస్తున్నారు. మరోవైపు బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.