సీపీ Vs కౌశిక్ రెడ్డి: ఖాకీ బాస్‌పై ఎమ్మెల్యే ‘ఫైరింగ్’.. ఏకే-47 ఆరోపణల వెనుక అసలు కథ ఇదేనా?

జిల్లా పోలీస్ బాస్ టార్గెట్ గా ప్రతిపక్ష ఎమ్మెల్యే మాటలతో తూటాలు పేలుస్తున్నారు. తగ్గేదేలే అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ తో ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యే ఎన్ని అలిగేషన్స్ చేస్తున్న ఖాకీలు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గేదేలేదు అంటూ సీరియస్ ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే. అంతటితోటి ఆగకుండా సిపి ఫ్యామిలీ మెంబర్స్ ఫైరింగ్ ప్రాక్టీస్ లో ఎలా పాల్గొంటారు అని కాంట్రవర్శీ కామెంట్స్ చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన వీడియోలను లీక్ చేస్తానని అంటున్నారు. ఇంతకు ఎవరా ఆ సిపి ఆయనను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే ఎవరు మరి..

 

ఒక ఎమ్మెల్యే వర్సెస్ ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్. వీరిద్దరి మధ్య మాటల తూటాలు. ఎమ్మెల్యే నోటికి పని చెబితే.. సీపీ చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకరి మీద మరొకరు పరోక్షంగా కారాలు, మిరియాలు నూరుకుంటున్నారు.అసలు ఎమ్మెల్యే అలిగేషన్స్ వెనుక మ్యాటర్ ఏంటనేది పోలీసు వర్గాలకు కూడా అంతు చిక్కట్లేదు. ఆ ఎమ్మెల్యే కు సిపీ కి ఎక్కడ చెడింది అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి కరీంనగర్ సిపీ పై తీవ్ర ఆరోపణలు చేశారు.

 

 

సిపీకి జల్సాలు ఎక్కువయ్యాయని కౌశిక్ ఆరోపణలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఆయుధాలు ఇచ్చి కరీంనగర్ సీపీ కాల్పులు జరిపిస్తున్నారని కౌశిక్ ఆరోపించారు. ప్రైవేటీ వ్యక్తులకు ఏకే47 ద్వారా షూటింగ్ ఎలా చేయిస్తారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఫోటోలు వీడియోలు బయట పెడతానని కౌశిక్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఐపీఎస్ ఆఫీసర్ గౌస ఆలం లక్ష్యంగా ఆయన రెండోసారి చేసిన వ్యాఖ్యలు చర్చని అంశం అయ్యాయి.

 

కరీంనగర్ సమీపంలోని ఫైరింగ్ రేంజ్ పరిధిలో సిపి ఆయన భార్య స్నేహితులు కలిసి దాదాపు 180 రౌండ్ల కాల్పులు జరిపారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సిపి గౌస్ ఆలంపై సీరియస్ అలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు.

నిత్యం ఏదో ఒక ఇష్యూతో హడావడి చేసే కౌశిక్ రెడ్డి ఈసారి కరీంనగర్ సిపీ ని టార్గెట్ చేయడం హార్ట్ టాపిక్ గా మారింది. సమ్మక్క జాతరలో తనను అరెస్ట్ చేశారని కరీంనగర్ సిపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కౌశిక్. దాంతో ఐపిఎస్ అసోసియేషన్ రంగంలోకి దిగేసరికి.. సారీ చెప్పి ఇష్యూకు పులి స్టాప్ పెట్టారు. అంతటితోటి వివాదం సమస్య పోయిందని అంతా భావించిన తరుణంలో సిపి గౌస ఆలంపై వరసపెట్టి సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కౌశిక్ రెడ్డి.

కొందరు అధికారులను అడ్డం పెట్టుకొని సిపి పెద్దఎత్తిన అవినీతికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దానికి సంబంధించిన ఆధారాలు కూడా త్వరలో బయట పెడతానని హడావుడి చేశాడు. అయితే కరీంనగర్ సిపి గౌస ఆలయం సెప్టెంబర్ నెలలో మూడు రోజుల పాటు సెలవులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మెరకు ఆయన ఉన్నత అధికారుల అనుమతి తీసుకొని 2025 సెప్టెంబర్ 20వ తేదీన లీవ్ పై వెళ్లి సెలవు ముగిసిన తర్వాత కరీంనగర్ చేరుకున్నట్టుగా సమాచారం. సెలవుపై ఢిల్లీకి వెళ్ళిన సిపి తన ఫ్యామిలీని కూడా వెంటపెట్టుకొని వెళ్ళినట్లుగా తెలుస్తుంది.

అయితే సెప్టెంబర్ 22న సిపి గౌస ఆలం భార్య స్నేహితులు ఫైరింగ్ రేంజ్ లో మూడు రకాల వెపన్ సాయంతో కాల్పులు జరిపారని ఎమ్మెల్యే ఆరోపిస్తూ ఉండడం గమనార్హం. పోలీస్ అధికారుల అనుమతి తీసుకొని ఢిల్లీకి వెళ్ళిన సిపి గౌస ఆలంతో పాటు ఆయన ఫ్యామిలీ ఫైరింగ్ రేంజ్ లో ఎలా ప్రత్యక్షం అవుతున్నారు అనేది అంతు చిక్కకుండా పోతుందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

ఒకవేళ సిపి ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వచ్చిన ఈ విషయం ఇంతకాలం బయటకు పక్కకుండా ఉండడం అసాధ్యమేనని పోలీసులు చెబుతున్నారు. ఫైరింగ్ ప్రాక్టీస్ చేసేందుకు వచ్చిన పోలీసుల ద్వారా అయినా ఈ విషయం లేకయ్యే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపున వివిధ విభాగాలకు చెందిన అధికారులు కూడా ఫెరింగ్ రేంజ్ ను సందర్శించారు. ఆ సమయంలో అయినా ఈ విషయం వెలుగులోకి వచ్చేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సిపి గౌస ఆలం మాత్రం నో కామెంట్ అంటూ ఇష్యూ సీరియస్ నెస్ తగ్గిస్తున్నారనే టాక్ నడుస్తుంది. కౌశిక్ రెడ్డికి సిపీ కి ఎక్కడ చెడింది అనేది ఆసక్తికర చర్చగా మారింది. ఇసుక క్వారీల విషయంలో సిపి కాస్త కఠినంగా వ్యవహరించారు. ఇక పలు సందర్భాల్లో కౌశిక్ సిపీకి ఫోన్ చేశారట. ఎమ్మెల్యే రిక్వెస్ట్ లను విన్నట్టే విని తర్వా త సిపి లైట్ తీసుకోవడంతో నొచ్చుకున్నారట కౌశిక్. అప్పటినుంచే సమయం దొరికిన ప్రతిసారి సిపీని టార్గెట్ చేస్తున్నారట కౌశిక్. మరోవైపు సమ్మక్క సారలమా జాత్రలో కౌశిక్ ను పోలీసులు అడ్డుకోవడంతో మరింత ముదిరినట్టయింది.

 

దాంతో పోలీసులపై చిందులు తొక్కిన కౌశిక్ ఆ తర్వాత క్షమాపణ చెప్పాల్సి రావడంతో మరింత ఫ్రస్ట్రేషన్ అవుతున్నారట. నాతోనే క్షమాపణ చెప్పిస్తారా అంటూ రగిలిపోతున్నారట కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోపణలో డోస్ ని పెంచుతున్నారట.సిపి టార్గెట్ గా కొనసాగుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అలిగేషన్స్ ఎటు దారి తీస్తాయో చూడాలని అంటున్నారు. సీపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ వ్యవహారాన్ని గమనించిన సీనియర్ పొలిటిషియన్లు కౌశిక్ ఫ్రస్టేషన్ లో ఉన్నారని అంటున్నారు.