విజయవాడ పార్లమెంట్ పరిధిలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. తిరువూరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రావు ధర్నా చేపట్టారు. ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్నిపై వ్యభిచారం, గంజాయి, పేకాట వంటి అక్రమ దందాల ఆరోపణలు చేసిన కొలికపూడి.. ఇప్పుడు ఏకంగా భూ కబ్జాల అంశాన్ని తెరపైకి తెచ్చారు.
ప్రభుత్వ పెద్దల అండ ఉండటంతోనే ఎంపీ చిన్ని అరాచకాలు పెరుగుతున్నాయని, నియోజకవర్గంలో భూముల దోపిడీ జరుగుతోందని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఒకే కూటమిలో ఉండి ఇలా బహిరంగంగా ధర్నాకు దిగడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో(NTR DISTIC) అధికార కూటమి నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తిరువూరు (Tiruvuru)ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రావు మరియు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య ఎప్పటి నుంచో ఉన్న ‘కోల్డ్ వార్’ ఇప్పుడు బహిరంగ పోరాటంగా మారింది. ప్రభుత్వ భూముల ఆక్రమణదారుల నుంచి భూములను కాపాడాలంటూ ఎమ్మెల్యే కొలికపూడి స్వయంగా ధర్నాకు దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయం: కొలికపూడి ధర్నా
తిరువూరు నియోజకవర్గంలో విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారని, అధికారుల అండదండలతో ఈ దందా సాగుతోందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రావు (Kolikapudi Srinivasarao) నిరసన చేపట్టారు. “ప్రజల ఆస్తులను, ప్రభుత్వ భూములను కాపాడటమే నా మొదటి ప్రాధాన్యత. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు” అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే, ఈ ఆరోపణల బాణం నేరుగా ఎంపీ కేశినేని చిన్ని వర్గీయుల వైపే గురిపెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సంచలన ఆరోపణలు: వ్యభిచారం నుంచి భూ కబ్జాల వరకు..
గత కొంతకాలంగా కొలికపూడి మరియు కేశినేని చిన్ని మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గతంలోనే ఎంపీపై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు.విజయవాడ పార్లమెంట్ పరిధిలో వ్యభిచారం, పేకాట క్లబ్బులు, గంజాయి వ్యాపారాలు ఎంపీ కేశినేని చిన్ని(Kesineni Chinni) అండదండలతోనే సాగుతున్నాయని కొలికపూడి గతంలోనే నిలదీశారు. 2024 ఎన్నికల సమయంలో టికెట్ కోసం తన వద్ద నుంచి ఎంపీ కోట్లాది రూపాయలు వసూలు చేశారంటూ బ్యాంకు ట్రాన్సాక్షన్ వివరాలను కూడా ఎమ్మెల్యే బయటపెట్టడం అప్పట్లో కలకలం రేపింది. తాజాగా ప్రభుత్వ భూముల కబ్జా వెనుక ఎంపీ హస్తం ఉందంటూ నేరుగా ధర్నాకు దిగడం వివాదాన్ని మరింత ముదిర్చింది.
అధిష్టానం అండ ఎవరికి?
ఎన్ని విమర్శలు వచ్చినా, ఆరోపణలు వెల్లువెత్తినా ఎంపీ కేశినేని చిన్నికి ప్రభుత్వ పెద్దల నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతోందని కొలికపూడి వర్గం ఆరోపిస్తోంది. ఎంపీ తీరు వల్ల పార్టీ ప్రతిష్ట మసకబారుతోందని, ఆయన చేస్తున్న ‘అరాచకాలు’ రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఎమ్మెల్యే వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రొటోకాల్ రగడతో ఇద్దరు నేతల మధ్య మొదలైన ఘర్షణ, ఇప్పుడు భూ కబ్జాల వరకు చేరడం విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తిరువూరులో కజ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలని ధర్నాకు దిగిన అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రావు
ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్ని వ్యభిచార, పేకాట, గంజాయి వ్యాపారాలపై ప్రశ్నించిన కొలికపూడి, తాజాగా ఎంపీ భూముల కజ్జాలపై ధర్నాకు దిగారు
ఎన్ని విమర్శలు వచ్చినా… pic.twitter.com/LoJrZlDQGW
— greatandhra (@greatandhranews) April 7, 2026