కొణిదెల నాగబాబు.. మెగాస్టార్ చిరంజీవి బ్రదర్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అన్నగా అందరికీ తెలుసు. జనసేనలో కీలక నేతగా కూడా కార్యకర్తల అభిమానాన్ని చూరగొన్నారు. ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీగా పుల్ బిజీగా ఉన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందులో నాగబాబుకు మంత్రి పదవి పక్కా అన్న టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హల్ చల్ చేస్తోంది. ఈసారి నాగబాబుకు మంత్రి పదవి వరిస్తుందా? జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రయత్నం ఫలిస్తుందా? ఇంతకీ ఏపీ కేబినెట్ విస్తరణలో ఉండేది ఎవరు? అనేది చూద్దాం.
జనసేన పార్టీలో కొణిదెల నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత సెకండ్ ప్లేస్‌లో నాగబాబు ఉన్నారు. పార్టీకి సంబంధించి నిర్ణయాల్లో పవన్ తర్వాత డెషిసన్ మేకింగ్ పవర్ కొణిదెల నాగబాబుకు ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎటొచ్చి కేబినెట్‌లో చోటు మ్యాటర్‌లోనే నాగబాబుకు ఛాన్స్ లభించలేదని జనసేన వర్గాలు ఫీలవుతున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కు పూర్తి స్థాయిలో కొణిదెల నాగబాబు చేదోడు వాదోడుగా ఉన్నారు. పవన్ బిజీగా ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలు నాగబాబే చూశారు. పార్టీ విషయంలో జనసేన కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్ ఎంత కమిట్మెంట్ తో పని చేస్తారో నాగబాబు కూడా అంతే కమిట్మెంట్ తో సేవలు అందిస్తున్నారు.
నాగబాబుకు పదవుల విషయంలో పెద్దగా న్యాయం జరగలేదన్న టాక్ లేకపోలేదు. అయినా కూడా వాటిని పట్టించుకోలేదు. జనసేన కోసం పవన్ కళ్యాణ్ కోసం నిస్వార్ధంగా పని చేస్తూ వచ్చారు నాగబాబు. ఏనాడూ ఫలానా పదవి కావాలని నాగబాబు డిమాండ్ చేయలేదట. 2024 ఎన్నికల సమయంలోనూ కూడా పార్టీ టికెట్ విషయంలో కొణిదెల నాగబాబు పెద్దగా డిమాండ్ చేయలేదట. టిడిపి బిజెపి జనసేన ఓ కూటమిగా ఏర్పడి అఖండ విజయం సాధించిన నేపథ్యంలో నాగబాబుకు ఏదో ఒక పెద్ద పదవి గ్యారెంటీ అన్న ప్రచారం జరిగింది. అయినా అది ఆచరణలో కనిపించలేదన్న టాక్ జనసేన కార్యకర్తలు, నాయకుల్లో పాతుకుపోయింది.
పార్టీ గెలుపు కోసం సీటును కూడా నాగబాబు త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ పట్టుబట్టి కొణిదెల నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించారు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో మంత్రివర్గంలో విస్తరణ అంటూ హడావుడి మొదలైంది. దీనికితోడు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం హీట్ మరింత పెంచింది. ప్రెజెంట్ చంద్రబాబు మంత్రివర్గంలోని ముగ్గురు నుంచి నలుగురిని జౌట్ అవుతారని టాక్ వస్తోందట. దీంతో ఈసారి నాగబాబుకు మంత్రి పదవి పక్కాగా వస్తుందని జనసేన నేతలు ఆశిస్తున్నారు. అసలు ఎప్పుడో నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉన్నా అది ఆలస్యమైందని అంటున్నారు. నాగబాబుకు మంత్రి పదవితో పాటు కీలక శాఖ ఇవ్వనున్నారనే ప్రచారం జనసేన వర్గాల్లో జరుగుతోందట. ఈ ప్రచారాన్ని పరోక్షంగా కూడా కూటమి నేతలు కూడా అండార్స్ చేస్తున్నారట.
జనసేనలో నాగబాబు ప్రాముఖ్యత కలిగిన నేత అని.. అలాంటి ఆయనకు మంత్రి పదవి ఇవ్వటం సముచితమే అని కూటమి కూడా చెబుతున్నారట. నాగబాబు మంత్రి పదవి ప్రచారం ఇవాల్టిది కాదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించినప్పుడే మంత్రి పదవి వస్తుందని ఊహాగానాలు బలంగా వినిపించాయి. కారణాలు ఏంటో గాని ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో జనసేన శ్రేణులు ఒకింత నిరాశకు గురయ్యారు. అయితే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనే ప్రచారంతో అది చల్లబడింది. రాజ్యసభ ఎన్నికల సమయంలో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించిన చివరికి అది కూడా దక్కలేదు. నాగబాబుకు సరైన పదవి దక్కకపోవడంపై జన సైనికుల్లో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో ఎట్టకేలకు ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు.
ఏపీ మంత్రివర్గంలో మార్పులు అనివార్యం అంటూ ఇప్పుడు ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో మంత్రి పదవి రేసులో నాగబాబు పేరు మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నామధ్య సీఎం చంద్రబాబు నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లంచ్ మీటింగ్ జరిగింది. సుమారు రెండు గంటల పాటు చంద్రబాబు పవన్ చర్చలు జరిపారు. ఈ సమయంలో మంత్రుల పనితీరు మార్పులపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారని, అదే సమయంలో నాగబాబుకు మంత్రి పదవి అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వచ్చింది. కూటమిలో జనసేనకు చంద్రబాబు తగిన ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో నాగబాబుకు మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశంఉందని జనసేన నేతలు ఆశతో ఉన్నారు.
ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. త్వరలో ఏపీ మంత్రివర్గంలో మార్పులు జరిగితే కొన్నిదల నాగబాబుకు అమాత్య పదవి తద్యమంటున్నారు జనసేన నేతలు.: త్వరలో జరిగే కేబినెట్ విస్తరణ నిజమే అయితే నాగబాబుకు మినిస్టర్ పదవి కన్ఫార్మ్ అని జనసేన నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి.. మరి. ఎప్పుడు కేబినెట్ విస్తరణ ఉంటుందో చూడాల్సి ఉంది.