వికారాబాద్ జిల్లా పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతుల పోరాటం ఉగ్రరూపం దాల్చింది. తమ భూములను కాపాడుకునేందుకు కాళ్లాపూర్ గ్రామస్థులు, రైతులు చేపట్టిన నిరసనలతో పరిగి పోలీస్ స్టేషన్ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి.
పోలీస్ స్టేషన్ ముట్టడి – గేట్ ఎక్కిన రైతులు: తమ భూముల సేకరణకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి కోరగా, పోలీసులు నిరాకరించారు. దీనికి తోడు రైతులకు మద్దతుగా వస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావును గృహనిర్బంధం చేయడంతో ఆగ్రహించిన కాళ్లాపూర్ గ్రామస్తులు, రైతులు భారీ సంఖ్యలో పరిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు గేట్లు మూసివేయడంతో, ఆవేశానికి లోనైన రైతులు ఏకంగా పోలీస్ స్టేషన్ గేటు ఎక్కి నినాదాలు చేశారు.
1200 ఎకరాల భూ పోరాటం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ దాహానికి తమకు జీవనాధారమైన 1200 ఎకరాల సాగు భూమి బలైపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు పోతే తాము ఎలా బతకాలని, ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రైతుల రిలే నిరవధిక దీక్షలకు మద్దతు తెలిపేందుకు హరీశ్ రావు వస్తున్నారని తెలిసి, పోలీసులు ముందస్తుగా పలువురు రైతులను, గ్రామస్థులను పోలీస్ స్టేషన్‌లోనే నిర్బంధించారు.
ఉద్రిక్తత కొనసాగింపు: పోలీస్ స్టేషన్ లోపల ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని, తమ దీక్షలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు స్టేషన్ ముందే బైఠాయించారు. ఈ ఘటనతో పరిగి నియోజకవర్గంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు కూడా తమకు లేదా అని రైతులు పోలీసులను నిలదీస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
మద్దతుగా హరీష్ రావు వస్తున్నాడని అనుమతి ఇవ్వకుండా రైతులను పరిగి పోలీస్ స్టేషన్లో పెట్టిన పోలీసులు
పోలీస్ స్టేషన్ ముందు కాళ్లాపూర్ రైతులు, గ్రామస్తుల ఆందోళన
రేవంత్ రెడ్డి భూ దాహానికి తమ 1200 ఎకరాలు పోతున్నాయని రైతులు చేస్తున్న రైతుల రిలే నిరవదిక దీక్షకు… pic.twitter.com/iPUtTKr0uF
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2026