తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..రేషన్ కార్డులు దరఖాస్తులు అప్పటినుంచే..?
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న సామాన్యులకు ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల స్వీకరణకు ఎటువంటి గడువు లేదని, అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఏళ్ల తరబడి కార్డుల కోసం వేచి చూస్తున్న లక్షలాది కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటగా మారింది.సాధారణంగా ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ప్రత్యేక విండోను ఓపెన్ చేసినప్పుడే దరఖాస్తులు స్వీకరిస్తుంది. కానీ, ప్రస్తుత ప్రకటన ప్రకారం.. నిరుపేదలు ఎవరైనా తమకు అవసరమైనప్పుడు దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు. దీంతో గత కొన్నేళ్లుగా కొత్త కార్డుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారికి మార్గం సుగమమైంది.
అర్హుల గుర్తింపు విషయంలో ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తోంది. గతంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి క్షేత్రస్థాయిలో గ్రామ సభలు ఏర్పాటు చేసింది. అక్కడ ప్రజల సమక్షంలోనే అర్హులైన వారిని ఎంపిక చేసి కార్డులు మంజూరు చేస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు ప్రాతిపదిక అయిన తెలుపు రంగు రేషన్ కార్డుల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది.ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గతేడాది సుమారు 14.40 లక్షల కొత్త కార్డులను మంజూరు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరిన్ని దరఖాస్తులను పరిశీలించి, అనర్హులను తొలగించి, నిజమైన పేదలందరికీ కొత్త కార్డులు అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గత కొన్నేళ్లుగా లక్షలాది మంది నిరుపేదలు ‘తెలుపు రంగు’ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని వేచి చూస్తున్నారు. గతంలో గ్రామ సభల ద్వారా, మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, చాలా మందికి ఇంకా కార్డులు అందకపోవడంతో క్షేత్రస్థాయిలో కొంత నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ “నిరంతర దరఖాస్తు” ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
కొత్త కార్డు కావాల్సిన వారు తమ సమీపంలోని మీ-సేవా కేంద్రాల్లో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తులను స్వీకరించిన అనంతరం అధికారులు వాటిని పరిశీలించి, అర్హతలను బట్టి కార్డులను మంజూరు చేస్తారట. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు ఈ విడతలో ప్రాధాన్యతనిచ్చి కార్డులు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కోటికి పైగా యాక్టివ్ రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. గతేడాది 14.40 లక్షల కొత్త కార్డులను మంజూరు చేసిన ప్రభుత్వం, తాజాగా దరఖాస్తు గడువును ఎత్తివేయడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక గ్యారంటీలకు తెలుపు రంగు రేషన్ కార్డు ప్రాతిపదికగా మారింది. దీంతో ప్రతి నిరుపేద కుటుంబం కార్డు కోసం ఆరాటపడుతోంది. రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన సన్న బియ్యం అందుతుండటంతో సామాన్యులు కార్డు కోసం వేచి చూస్తున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకే సిలిండర్ పొందేందుకు ఈ కార్డు ఉండాల్సిందేనని నిబంధనలు విధించడంతో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.
“గత ప్రభుత్వం హయాంలో కొత్త కార్డుల మంజూరు నిలిచిపోయింది.. అనేక కారణాలతో మా పేర్లు జాబితాలోకి చేరలేదు” అని చాలా మంది నిరుపేదలు వాపోతున్నారు. తమ పేదరికాన్ని గుర్తించి ఈ విడతలోనైనా కార్డు మంజూరు చేయాలని సర్కార్‌ను కోరుతున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, అర్హులకు అన్యాయం జరగకుండా కార్డులు ఇవ్వడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.
పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో కోటికి పైగా కార్డులు చురుగ్గా ఉన్నాయి. గతేడాది 14.40 లక్షల కొత్త కార్డులు జారీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు దరఖాస్తు గడువు ఎత్తివేయడంతో కొత్తగా లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది.