వారసురాలి కోసం వ్యూహాత్మక అడుగు.. విజయలక్ష్మికి ఆ కీలక పదవి దక్కేనా?

ప్రస్తుతం తెలుగు రాజకీయ వర్గాల్లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. సదరు మాజీ రాజ్యసభ సభ్యుడు తన కుమార్తెను రాజ్యసభ పంపేందుకు పావులు కదుపుతున్నారా? లేక రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ లేదా లోక్‌సభ బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. పాలిటిక్స్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆ రాజ్యసభ మాజీ సభ్యుడు ఇక రాజకీయ ప్రస్థానం చాలనుకుంటున్నారంట. వయోభారంతోనో, రాజకీయాలంటే బోరు కొట్టో ? ఆ నిర్ణయం తీసుకోలేదంట. తన గారాల కూతురు కోసం ఆ పెద్దాయన రాజ్యసభ పదవి రేస్ నుండి తప్పుకున్నారంట. కూతురికి పదవి వస్తే చాలు…తనకు అదే హ్యాపీ అంటున్నారంట! ఇంతకీ ఎవరా తండ్రి…!ఎవరా కూతురు…? కూతురు కోసం ఏ పదవి రేస్ నుండి తప్పుకున్నారు?… కూతురుకు వచ్చే పదవి ఏంటి…?

రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం, ఎన్నెన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆ సీనియర్ నేత.. ఇప్పుడు తన వారసురాలి రాజకీయ భవిష్యత్తు కోసం అత్యున్నత పదవినే తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనే మాజీ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు . తన గారాల పట్టి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని మళ్లీ పవర్‌లోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన వేసిన ముందస్తు స్కెచ్ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఒకవైపు తన రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన కేకే.. మరోవైపు మేయర్ పదవీకాలం ముగిసి ఖాళీగా ఉన్న తన కుమార్తెకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి దక్కించుకునేలా పావులు కదుపుతున్నారు. “నాకు రావాల్సిన గౌరవం దక్కింది.. నా బిడ్డకు అవకాశం వస్తే చాలు” అంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు, రాజ్యసభ రేసు నుండి వ్యూహాత్మకంగా తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

నిన్న మొన్నటి వరకు సునీతా రావు, రమ్య రావు వంటి ఉద్దండులు ఈ రేసులో ఉన్నా.. కేకే పరపతితో విజయలక్ష్మి పేరు ఇప్పుడు అందరికంటే ముందు వరుసలో వినిపిస్తోంది. అయితే, ఊహించని మలుపులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కాంగ్రెస్ రాజకీయాల్లో.. ఈ ‘పెద్దాయన’ త్యాగం ఫలిస్తుందా? లేక చివరి నిమిషంలో సమీకరణాలు మారిపోతాయా? సమాధానం దోరుకుతుందా..? లేదా ప్రశ్నలుగానే మిగిలిపోతాయా..? అనేది మున్ముందు చూడాల్సి ఉంది.

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన విజయలక్ష్మి, మేయర్ పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం సాధారణ కార్యకర్తగానే కొనసాగుతున్నారు. ఆమెకు తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కేకే భావిస్తున్నారు. రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, తనకంటే తన కుమార్తెకే ఆ అవకాశం దక్కాలని ఆయన కోరుకుంటున్నారట. “నాకు రావాల్సినవన్నీ వచ్చాయి, ఇప్పుడు నా కుమార్తెకు అవకాశం వస్తే చాలు” అని ఆయన తన సన్నిహితులతో చర్చించారని తెలుస్తుంది. రాజ్యసభ రేసులో తాను ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేకే ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు ప్రస్తుతానికి ఎలాంటి పదవులపై ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేయడం విశేషం.

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో నామినేటెడ్ పదవుల సందడి మొదలైంది. ఒకవైపు మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మరోవైపు మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద.. ఈ ఇద్దరు కీలక నేతల తదుపరి అడుగులు ఎటు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మరోవైపు, నేరెళ్ల శారద పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి ఖాళీగా ఉంది. ఈ పదవి కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ నెలకొంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కనిపిస్తోంది.

మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సేవలందించిన నేరెళ్ల శారద, ఈసారి మళ్లీ అదే పదవిని ఆశించడం లేదని సమాచారం. ఆమె ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో లేదా ఇతర కీలక రాజకీయ పదవుల చట్టసభల అడుగు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.శారద రేసులో లేకపోవడంతో, ఆ ఖాళీ అయిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.విజయలక్ష్మికి ఛాన్స్? మేయర్ హోదాలో పనిచేసిన అనుభవం ఉన్న గద్వాల విజయలక్ష్మిని ఈ పదవిలో కూర్చోబెడతారా? లేక ఆమెను నేరుగా రాజ్యసభకు పంపేందుకు కేకే గట్టిగా ప్రయత్నిస్తారా? అన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కూడా పార్టీ కోసం కష్టపడుతున్నాని తనకు ప్రభుత్వంలో సరైన గుర్తింపు కావాలని ఆమె కోరుతున్నారట. ఎమ్మెల్సీ లేదా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవిపై ఆమె కన్నేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత పెంచాలని ఆమె ఆందోళన కూడా చేపట్టారు.

కేసీఆర్ అన్న కూతురైన రమ్య రావు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏదో ఒక కార్పొరేషన్ పదవి ఆశిస్తున్నారట. ఇప్పుడు మహిళా కమిషన్ ఖాళీగా ఉండటంతో, తన సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలని ఆమె గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

గద్వాల్ నుండి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన సరిత తిరుపతయ్య ఈమె పేరు కూడా వినిపించినప్పటికీ, ఆమె మాత్రం కమిషన్ కంటే ప్రత్యక్ష రాజకీయ పదవుల ఎమ్మెల్సీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

మహిళా కమిషన్ పదవి కోసం సునీతా రావు, రమ్య రావు వంటి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం విజయలక్ష్మి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, పైగా కేకే వంటి సీనియర్ నేత అండదండలు ఉండటం ఆమెకు కలిసి వచ్చే అంశాలు. కేకే ఇప్పటికే తాను రాజ్యసభ రేసులో లేనని స్పష్టం చేయడంతో, విజయలక్ష్మికి రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత ఉన్న ఈ నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశాలు 90% కనిపిస్తున్నాయి.

రాజ్యసభ సభ్యత్వం కంటే కూడా, ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి తన కుమార్తెకు దక్కితేనే రాజకీయంగా ఆమెకు పట్టు దొరుకుతుందని కేకే భావిస్తున్నారు. అందుకే ‘నాకు పదవి వద్దు.. నా బిడ్డకు అవకాశం ఇవ్వండి’ అనే సంకేతాలను హైకమాండ్‌కు బలంగా పంపారు.అయితే, ఇది కాంగ్రెస్ పార్టీ! ఇక్కడ చివరి నిమిషంలో సమీకరణాలు మారిపోవడం కొత్తేమీ కాదు. నేరెళ్ల శారద లాంటి సీనియర్లు లేదా పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన ఇతర మహిళా నేతలు ‘తమకు అన్యాయం జరుగుతోంది’ అని గొంతు విప్పితే పరిస్థితి మారే అవకాశం ఉంది.

అయితే, ఇది కాంగ్రెస్ పార్టీ! ఇక్కడ చివరి నిమిషంలో సమీకరణాలు మారిపోవడం కొత్తేమీ కాదు. నేరెళ్ల శారద లాంటి సీనియర్లు లేదా పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన ఇతర మహిళా నేతలు ‘తమకు అన్యాయం జరుగుతోంది’ అని గొంతు విప్పితే పరిస్థితి మారే అవకాశం ఉంది.