‘ట్రెజరీ’ పదోన్నతులకు మళ్లీ పాత ప్రతిపాదనే
రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టరేట్ కింద ఐదేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న అధికారుల పదోన్న తుల వ్యవహారం ఎటూ తేలడం లేదు. దీంతో ప్రమోషన్ల కోసం ట్రెజరీ, అకౌంట్స్ విభాగం అధికారులు ఆందోళన చెందుతు న్నారు. డీటీఏ పంపించిన ఫైలులో సవర ణలు చేసి పంపించాలంటూ న్యాయ శాఖ సూచించినా, ఆర్థిక శాఖ అధికారులు పదోన్న తుల విషయంలో పాత పద్ధతినే సిఫారసు చేస్తూ ఫైలును రూపొందించారన్న విమర్శ లున్నాయి. జిల్లాల్లో పని చేసే సబ్ ట్రెజరీ ఆఫీసర్ లు, డైరెక్టరేట్లో పని చేసే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జేఏవోలకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ , అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.
కొన్నింటిని ప్రత్యక్ష ఎంపిక డీఆర్ విధా నంలో భర్తీ చేస్తారు. అయితే, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో తెలంగాణకు ఒకే ఒక మల్టీ జోన్ 3 ఉండేది. అప్పుడు ’20 సైకిల్ ఆధా రంగా పదోన్నతులు ఇచ్చేవారు. అంటే, ట్రెజరీ విభాగానికి చెందిన ఎన్డీటీవోలకు 9, అకౌంట్స్ విభాగానికి చెందిన జేఏవోలకు 5 పోస్టుల అవకాశం కల్పించి పదోన్నతులిస్తూ ఏటీవో, ఏఏవో పోస్టులను భర్తీ చేసేవారు. మిగతా 6 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేవారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగా ణలో రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా ‘గెజిటెడ్ సర్వీస్ రూల్స్ ‘ను సవరించి ’20 సైకిల్కు బదులుగా ఒక్కో మల్టీ జోన్కు 10 సైకిల్ పోస్టులతో డైరెక్టరేట్ ఫైలును తయారు చేసి ఆర్థిక శాఖకు పంపింది. అంటే, ఒక్కో మల్టీ జోన్లో ఎన్టీవోలకు 5, జేవోలకు 2, డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కింద 3 పోస్టులను ప్రతిపాదించింది. ఈ ఫైలులో ఆర్థిక శాఖ కొర్రీలు పెట్టి, 20 సైకిల్ పంపించగా న్యాయ శాఖ తిరస్క రించింది. ఒక్కో మల్టీ జోన్లు 10 సైకిల్ ఫైలును తయారు చేసి పంపించాలని సూచించింది. అయినా, ఆర్థిక శాఖ మళ్లీ 20 సైకిల్ తోనే తాజా ఫైలును తయారు చేసి నట్లు తెలిసింది.
ఇలా ఒక్కో మల్టీ జోన్ కు 20సైకిల్ ను అమలు చేస్తే రెండు జోన్లకు కలిపి 40 పోస్టుల్లో పదోన్నతుల పోస్టులు 28 ఖాళీ కావాల్సి ఉంటుందని, అంత పెద్దమొత్తంలో ఒకేసారి పోస్టులు ఖాళీ కాబోవని అకౌంట్స్ విభాగం వారు వివరిస్తున్నారు. అందుకే ఐదేళ్ల నుంచి పదోన్నతుల ప్రక్రియను చేపట్టడం లేదని, తద్వారా సీనియర్లకు పదోన్న తులు లభించడం లేదని ఆరోపిస్తున్నారు. ఒక్కో జోన్లో 10 సైకిల్ ను అమలు చేస్తే ఏడేసి చొప్పున రెండు జోన్లకు కలిపి 14 ఖాళీలు ఏర్పడతాయని, పదోన్నతులకు వీలవుతుందని చెబుతున్నారు. ఈ విధానాన్ని అమలు చేయాలంటూ ఆర్థిక శాఖను కోరు తున్నా పట్టించుకోవడం లేదని విమర్శిస్తు న్నారు. పైగా ఆర్థిక శాఖలోని కొంత మంది అధికారులు తమకు సంబంధం లేకపోయినా అత్యుత్సాహంతో 20 సైకిల్ ను ముందుకు తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఒక్కో మల్టీ జోన్‌కు 10 సైకిలు అమలు చేస్తూ పదోన్నతులకు మార్గం సుగమం చేయాలని కోరుతున్నారు. సచివాలయంలోని సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను విభాగాధిపతుల కార్యాలయాలు అధికారులతో భర్తీ చేసే సందర్భంలో అకౌంట్స్ విభాగం అధికారులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
డీటీఏ పరిధిలోని రెండు విభాగాలకు పదోన్నతుల విషయంలో నిష్పత్తిని ఖరారు చేశారు. ఉదాహరణకు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పదోన్నతికి సంబంధించి 10:4:6 నిష్పత్తిలో నియామకాలు చేపడ తారు. 20 పోస్టులు ఖాళీ ఉంటే… ఇందులో ట్రెజరీ విభా గానికి 10 పోస్టులు పదోన్నతి కల్పిస్తే, అకౌంట్స్ విభా గానికి 4 పోస్టులు పదోన్నతి ద్వారా ఇస్తారు. మిగిలిన 6 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. తాజాగా ఈ నిబంధనల్లో మార్పులు చేస్తూ ట్రెజరీస్ అం డ్ అకౌంట్స్ డైరెక్టర్ నిబంధనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నిబంధనల్లో 11:3:6 నిష్పత్తిని అనుసరించాలని కోరడం ఇప్పుడు ఆ శాఖలో దుమారం రేకెత్తిస్తోంది. ఇది ట్రెజరీస్ అధికారులకే అను కూలంగా ఉన్నాయని, అకౌంట్స్ విభాగం పదోన్నతి కోటాను ట్రెజరీస్ కు కట్టబెట్టడంపై ఇప్పుడు ఆ శాఖలో గందరగోళానికి కారణమైంది. పదోన్నతిలో నిబంధనల మార్పుపై ఆర్థిక శాఖ సైతం ఆక్షేపించింది. సంప్రదింపులు లేకుండా నిర్ణయం తీసుకోవడంపై వివరణ కోరింది. ఇష్టా నుసారంగా నిబంధనలు మార్పు చేయడంపై అకౌంట్స్ ఉద్యోగులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు ఫిర్యాదులు సమర్పించారు. ఈ అంశంపై జిల్లాల నుంచి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.