ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ రెగ్యులర్ గా హైదరాబాద్ కి రానున్నారా? బెంగలూరు వద్దని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఎవరైనా ఏమైనా సూచనలు చేశారా? అందుకే హైదరాబాద్ నుంచి తన రాజకీయ వ్యూహాలను రచించనున్నారా? జగన్ తెలంగాణ వైపు చూడటం వెనక అసలు రహస్యం ఏంటి? జగన్ వరుస హైదరాబాద్ పర్యటనలపై రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల వరుసగా హైదరాబాద్ పర్యటనలు చేస్తున్నారు. సిబిఐ కేసుల విచారణ నేపథ్యంలో నాంపల్లి కోర్టుకు రావటం అటెండ్ అయి వెళ్ళటం ఒకెత్తు అయితే హైదరాబాద్ లోనే మకాం వేస్తారని వైఎస్ఆర్సీపీ వర్గాల్లో ఇన్ సైడ్ టాక్. జగన్ హైదరాబాద్ రాక వెనుక బలమైన కారణం ఉందని రాజకీయ విశ్లేషణలు స్టార్ట్ అయ్యాయట. ఆ కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. సహజంగా ఒక పొలిటికల్ పార్టీ అధినేత ఎక్కడికి వెళ్తే అక్కడ కార్యకర్తలు ఘనస్వాగతం పలకటం తమ నేతకు మద్దతుగా నిలవడం చేస్తారు.
కానీ జగన్ పర్యటన మాత్రం అంతకు మించి అనేలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అయినా తెలంగాణలో అయినా ఏమాత్రం తగ్గని క్రేజ్ జగన్‌కు ఉందని చర్చ జరుగుతోంది. రెండు నెలల క్రితం నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్ వస్తున్నారని తెల్సి వచ్చిన అభిమాన సంద్రాన్ని చూసి రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్న క్రేజ్ మళ్ళీ రావాలంటే ప్రజల మధ్యలో ఎప్పుడూ ఉండాలని ఓ సర్వే సంస్థ సలహా ఇచ్చిందట. జగన్ ఎక్కడ పర్యటించినా కూడా చుట్టూ జనాలు ఉండే విధంగా చూసుకోవడం ద్వారా సోషల్ మీడియా దృష్టంతా జగన్ వైపే వెళ్తుందని ఆ సర్వే సంస్థ సూచించిందట.
మరోవైపు కూటమి సర్కార్ జగన్ పర్యటనల సమయంలో భారీగా కార్యకర్తలు అభిమానులు తరలి రావటాన్ని శాంతిభద్రతల ఇష్యూగా పరిగణించి ఆంక్షలు విధించడం తద్వారా జగన్ కి కొంత మైలేజ్ తగ్గే అవకాశం ఉందని ఆ సర్వే ఏజెన్సీ చెప్పినట్లు సమాచారం. జగన్ పర్యటనలను కూటమి సర్కార్ రచ్చరచ్చ చేయాలని చూస్తోంది. పల్నాడు ప్రాంతంలో జగన్ వెహికల్ ఒకరి మీదకు ఎక్కినట్లు టీడీపీ సోషల్ మీడియాలో హడావుడి చేశారు. తర్వాత ఆ సంగతే ఊసు ఎత్తటం లేదు. ఎందుకు అంటే సమాధానమే లేదు.
దీనికి తగ్గట్లు ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు జగన్ చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రాంతంతో సంబంధం లేకుండా జగన్ ఎక్కడికి వెళ్ళినా అభిమానం సంద్రం పోటెత్తుతున్నారు. లోటస్ పాండ్ వద్ద జనం నిరాజనంతో వైఎస్ఆర్ సీపీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని సదరు సర్వే సంస్థ అంచనా వేస్తుందట. నిత్యం ప్రజల్లోనే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి హైదరాబాద్ కి రెగ్యులర్ గా రావటం లోటస్ పాండ్ నుంచి తన కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయటం ఇక్కడే సమావేశాలు నిర్వహించుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారట. అయతే.. ఆ సర్వే సంస్థ చెప్పినట్టు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదట. తాడేపల్లిలోనే ఎప్పటిలాగే.. క్యాడర్ ను మెయింటైన్ చేస్తూ లీడర్లతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారట. కేడర్‌తో , లీడర్స్‌తో సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారట.
ఓవరాల్‌గా అయితే.. వచ్చే ఏడాది ప్రారంభంలో జగన్ రెండోసారి పాదయాత్ర చేయాలనే ప్లాన్‌తో ఉన్నారట. దాని ప్రకారమే ముందుకు వెళ్లున్నారు. మిగతావన్నీ మీడియా సృష్టించినవే అని పార్టీ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి.. జగన్ బెంగలూరు నుంచి హైదరాబాద్‌కి మకాం ఎప్పుడు మారుస్తారనేది.