AP: కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లిలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష పెన్నులతో స్వామిని అభిషేకించారు. రథసప్తమి సందర్భంగా దర్శనానికి వచ్చే భక్తులు, విద్యార్థులకు పెన్నులను ప్రసాదంగా పంపిణీ చేస్తారు. చదువుల పండుగగా పిలిచే ఈ వేడుకలో పూజించిన పెన్నులను వాడితే విజయం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.