పశ్చిమాసియాలో ముగిసిన ఖమేనీ శకం – ఇరాన్ గడ్డపై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు!

పశ్చిమాసియా రాజకీయ చిత్రపటం ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ జరిపిన భీకర క్షిపణి దాడుల్లో ఇరాన్ ఆధ్యాత్మిక, రాజకీయ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా ధ్రువీకరించడంతో ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేగింది.శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వందలాది యుద్ధ విమానాలు, క్షిపణులతో ఇరాన్ పై విరుచుకుపడింది.తాజా దాడుల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ విధించగా, ఇరాన్‌లో మొబైల్ సేవలు నిలిచిపోయాయి. టార్గెట్ టెహ్రాన్ – ఏం జరిగింది? అనేది ఓ సారి చూద్దాం

అణుఒప్పందంపై అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో .. ఇరాన్ పై ఇజ్రాయిల్ క్షిపణి దాడులకు పాల్పడింది . టెహ్రాన్ అంతటా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.‌ అమెరికా సాయంతోనే ఇజ్రాయిల్ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. భారత్ అటు ఇజ్రాయిల్ తోను ఇటు ఇరాన్ తోనూ బలమైన సంబంధాలను కలిగి ఉంది . తాజా పరిస్థితుల్లో ఏ ఒక్క పక్షం వైపు మొగ్గు చూపకుండా రెండు దేశాలు సమయమనం పాటించాలని దౌత్యపరంగా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతోంది.

శత్రుదేశం ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించుకునేందుకు ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి కట్స్ ప్రకటించారు.‌ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ ఫిజిష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు చేపట్టారు. ఈ నేపథ్యంలో టెల్ అవివ్ సైన్యం తన దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. వైమానిక దాడులు జరిగే అవకాశం ఉన్నందున దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది.

టెల్ అవివ్ తో సహా పలు ప్రాంతాల్లో సైరెన్లు మోగాయి స్కూళ్ళు, కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించారు.‌ తాజా దాడులు నేపథ్యంలో పౌర విమానాలకు ఇజ్రాయిల్ తన గగనతలాన్ని మూసేసింది. అటు ఇరాన్, ఇరాక్ లు కూడా తమ‌గగనతలాలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరాన్ లో మొబైల్ సేవలు నిలిచిపోయాయి.

 

ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న విభేదాలకు పరాకాష్ట. 1979 ఇరానీయం విప్లవం కంటే ముందు ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. విప్లవం తర్వాత అధికారంలోకి వచ్చిన ఇస్లామిక్ ప్రభుత్వం ఇజ్రాయిల్ని శత్రువుగా పరిగణించింది . ఇరాన్ రహస్యంగా అను ఆయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయిల్ బలంగా నమ్ముతోంది.‌ ఇది తమ మనుగడకే ముప్పు అని భావించి ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయిల్ తరచూ దాడులు చేస్తోంది. ఇరాన్ తన మిత్రబక్షాలైన హస్బల్లా .. లేబనాన్ హమాస్.. గాజా మరియు హుతీ యమన్ తిరుగుబాటుదారులకు ఆయుధాలు ఆర్థిక సాయం అందిస్తూ ఇజ్రాయిల్ పై దాడులకు ప్రోత్సహిస్తోంది..

2024 – 26 మధ్య అనేక సందర్భాల్లో రెండు దేశాల మధ్య కీలకమైన దాడులు సంభవించాయి.‌ 2024 ఏప్రిల్ లో సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ పై ఇజ్రాయిల్ దాడి చేయగా ప్రతి చర్యగా ఇరాన్ మొదటిసారి నేరుగా ఇజ్రాయిల్ పై వందలాది డ్రోన్లు మిస్సైళ్ళతో దాడి చేసింది.

2025 జూన్ నెలలో ఇరుదేశాల మధ్య 12 రోజులపాటు తీవ్రమైన యుద్ధం జరిగింది.‌ ‌అందులో అమెరికా కూడా జోక్యం చేసుకొని ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది.
ఇప్పుడు తాజాగా ఇజ్రాయిల్ మరోసారి ముందస్తు దాడి ప్రారంభించింది. తెహ్రాన్ వంటి నగరాల్లో పేలుళ్లు సంభవించాయి.

ఇజ్రాయిల్ – ఇరాన్ ఘర్షణలో అమెరికా ఇజ్రాయిల్ కు ప్రధాన సైనిక దౌత్య మరియు వ్యూహాత్మక మద్దతుదారుగా వ్యవరిస్తోంది. ఇరాన్ అణు సామర్ధ్యాన్ని అడ్డుకోవడంలో ఇజ్రాయిల్ కీ సాయం చేస్తోంది. ఆయుధాల సరఫరా నిఘా సమాచారం ఇరాన్ పై ఆంక్షలు విధించడం వంటి చర్యలకు దిగుతోంది. ఉద్రిక్తతలను నియంత్రించడానికి యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చూడటానికి అమెరికా ప్రయత్నిస్తోంది

ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధంలో అమెరికా పాత్ర లో ముఖ్యాంశాల గురించి చెప్పాలంటే.. ఇజ్రాయిల్ కు అత్యాధునిక ఆయుధాలను క్షిపణి రక్షణ వ్యవస్థలను అందించడం.. అవసరమైతే నేరుగా ఇరాన్ పై దాడులకు సైనిక చర్యలను చేపట్టటం ముఖ్యమైనదిగా చెప్పాలి.‌ ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై నిఘా సమాచారాన్ని ఇజ్రాయిల్ తో పంచుకుంటుంది.‌ ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అణు కార్యక్రమాన్ని బలహీనపరచడానికి కఠినమైన ఆంక్షలు కొనసాగిస్తోంది. ఇరాన్ ను ఒంటరిని చేయటానికి అంతర్జాతీయ మద్దతును కూడగట్టడం, ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల చర్యలను నిరోధిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇరాన్ లో యూఎస్ పెద్ద ఎత్తున యుద్ధ కార్యక్రమాలను ప్రారంభించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో తెలిపారు

రక్షణ బడ్జెట్ విషయంలో ఇరాన్ కంటే ఇజ్రాయిల్ ఎక్కువగా ఖర్చు చేస్తుంది . 2022, 2023 సంవత్సరాల్లో ఇరాన్ రక్షణ బడ్జెట్ 7.4 బిలియన్ డాలర్లు ఉంటే ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ బడ్జెట్ 19 మిలియన్ డాలర్లు అంటే రెట్టింపు కంటే ఎక్కువ ఉంది అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకటించింది . జిడిపిలో రక్షణ రంగానికి కేటాయిస్తున్న నిధుల విషయంలోనూ టెల్ అవివ్, తెహ్రాన్ కంటే చాలా ముందు ఉంది.

ఇజ్రాయిల్ రక్షణకు ఐరన్. డోమ్ యారో వ్యవస్థలు వెన్నెముక లాంటివి. ఇజ్రాయిల్ అనేక దేశాలకు క్షిపణులను ఎగుమతి చేస్తోంది. పశ్చిమసియాలో ఇరాన్ మిస్సయిల్ కార్యక్రమం అతి పెద్దది. వైవిధ్యమైనదిగా చెబుతారు . ఇరాన్ వద్ద 3 వేలకు పైగా ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. 1980 నుంచి 88 వరకు పొరుగున ఉన్న ఇరాన్ తో జరిగిన యుద్ధం వల్ల ఇరాన్ తన క్షిపణివ్యవస్థపై విస్తృతంగా పనిచేసింది.‌ ఇందులో భాగంగా స్వల్ప శ్రేణి దీర్ఘ శ్రేణి మిస్సయిడ్లు డ్రోన్లను అభివృద్ధి చేసింది.

 

అణ్వస్త్ర విస్తరణ నిరోధక బాధ్యతలను ఇరాన్ 20 ఏళ్లలో తొలిసారి ఉల్లంఘించినట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ బోర్డ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రకటించింది. దీనిపై అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా బోర్డులోని 35 దేశాల్లో 19 దేశాలు ఓటు వేశాయి.‌ ఇరాన్ తన రహస్య అణుకార్యక్రమాల గురించి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వవటంలో విఫలమైందని ఇది నియమావళిని ఉల్లంఘించడమేనని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది . అణ్వస్త్రాల తయారీకి అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన రియాక్టర్లలో ఉపయోగించే శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తీర్మానం రాజకీయ పరమైనదన్న ఇరాన్ తాను కొత్తగా మరో శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది .‌ తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనదని, తమ అణ్వాయుధాలను ఉత్పత్తి చేయటం లేదా సేకరించే ప్రసక్తి ఉండదని పేర్కొంది.‌ ఇరాన్ చెంత అణ్వాయిదాలు చేరితే అది తమకు పెనుముప్పుగా మారుతుందని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు చెబుతున్నారు.‌ అందుకే ఇరాన్ మీద దౌత్య మార్గంలో కాకుండా సైనిక చర్య తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం ఎక్కువ కాలం జరిగితే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మధ్యప్రాచ్యంలో అస్థిర పరిస్థితులు ఏర్పడతాయిచమురు ధరలు విపరీతంగా పెరిగి ప్రపంచవ్యాప్త మాంద్యానికి దారి తీయవచ్చు. ఇరాన్ చమురు సరఫరాకు ఆటంకం కలిగితే ఇంధన సంక్షోభం తలెత్తుతుంది .ఇరాన్ తన మిత్ర దేశాల ద్వారా మధ్య ప్రాంతంలో దాడులను తీవ్రతరం చేయవచ్చు. ఇరాన్ అణు కేంద్రాలు లేదా సైనిక స్థావరాలపై ఇజ్రాయిల్ దాడులు చేసే ప్రమాదం ఉంది .ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వరకు హార్ముజ్ జల సంధి మార్గం ద్వారానే సాగుతుంది .దీనిని ఇరాన్ మూసివేస్తే అది అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. దాడుల కారణంగా పర్యావరణ నష్టం మరియు పౌరుల మరణాలు భారీగా ఉంటాయి. దీనివలన ప్రజలు వలస వెళ్లే ప్రమాదం ఉంది.

 

ఇరాన్ కు సైనిక సిబ్బంది బలం ఎక్కువగా ఉంటే ఇజ్రాయిల్ కు అత్యాధునిక సాంకేతికత మరియు వైమానిక శక్తి బలంగా ఉన్నాయి. దాంతో పోరాటం బాహాబాహీ అన్న చందంగానే సాగుతుంది.ఇజ్రాయిల్ -ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారిన పరిస్థితుల్లో.. భారత్ సంక్లిష్టమైన దౌత్య పాత్రను పోషిస్తోంది.‌ ఏ ఒక్క పక్షం వైపు మొగ్గు చూపకుండా రెండు దేశాలు సమయమనం పాటించాలని దౌత్యపరంగా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతోంది .భారత్ అటు ఇజ్రాయిల్ తోను ఇటు ఇరాన్ తోనూ ఎలాంటి వ్యూహాత్మక సంబంధాలను కలిగి ఉంది.
ప్రధానమంత్రి మోడీ ఇజ్రాయిల్ పర్యటన సందర్భంగా.. ఇరుదేశాల మధ్య సంబంధాలు శాంతి ఆవిష్కరణ శ్రేయస్సు కోసం ప్రత్యేక భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రక్షణ సైబర్ సెక్యూరిటీ సాంకేతిక రంగాల్లో భారత్ ఇజ్రాయిల్ మధ్య సహకారం మరింత బలపడింది

భారత్ కి ఇరాన్ ఒక ముఖ్యమైన శక్తి వనరుల భాగస్వామ్యం అంతేకాకుండా మధ్య ఆసియాకు ప్రధాన మార్గమైన చాబహార్ పోర్టు అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోర్టు ద్వారా భారత్ తన వాణిద్య ప్రయోజనాలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయిల్ లలో ఉన్న భారతీయ పౌరుల రక్షణ కోసం భారత రాయబార కార్యాలయాలు అడ్వైజరిలను జారీ చేస్తున్నాయి‌. వారు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నాయి. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది .‌ అలాగే ఎర్ర సముద్రం, పరిషియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకల రాకపోకలకు అంతరాయం కలగటం వల్ల భారత్ ఎగుమతులు దిగుమతులపై భారం పడుతుంది. ఈ అంశాలను అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు భీకరంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులతో ఇరాన్ గడ్డపై పెను ప్రకంపనలు సృష్టించాయి. ఇరాన్ అగ్రనేత, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఈ భీకర దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. దశాబ్దాలుగా ఇరాన్ రాజకీయ, మతపరమైన అధికారానికి కేంద్ర బిందువుగా ఉన్న ఖమేనీ శకం ఇలా ముగియడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

శనివారం రాత్రి అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ఇరాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఖమేనీ నివాసం, కార్యాలయం లక్ష్యంగా జరిగిన అత్యంత శక్తివంతమైన క్షిపణి దాడుల్లో ఆయన మరణించారని తెలుస్తోంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఖమేనీ మరణాన్ని ధ్రువీకరిస్తూ ప్రకటన చేయగా, ఆ తర్వాత కొద్దిసేపటికే ఇరాన్ ప్రభుత్వం కూడా ఈ వార్తను నిర్ధారించింది.తమ దేశ అత్యున్నత నేత మరణానికి గుర్తుగా ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.ఖమేనీ మరణంతో ఇరాన్‌లో తదుపరి అధికార పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ప్రపంచదేశాల్లో ఉత్కంఠ రేపుతోంది.ఖమేనీ మరణం ఇరాన్ అంతర్గత రాజకీయాలనే కాకుండా, మొత్తం పశ్చిమాసియా సమీకరణాలను మార్చేయనుంది. ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అమెరికా-ఇజ్రాయెల్ తదుపరి వ్యూహం ఏమిటి? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.