Perni Nani: బందర్ కూల్చివేతలో హైడ్రామా.. పోలీసుల తీరుపై పేర్ని ఫైర్!

బందర్ పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక ఇంటి కూల్చివేత ఉదంతం కాస్తా.. పోలీసు అధికారులకు మరియు మాజీ మంత్రి పేర్ని నాని సోదరుడు, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని కిట్టు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని కిట్టు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఏం జరిగింది?
జిల్లా పరిషత్ సెంటర్ నుంచి చిలకలపూడి వెళ్లే రోడ్డులో, కూల్చివేత జరుగుతున్న ప్రాంతానికి 100 మీటర్ల ముందే పేర్ని కిట్టును పోలీసులు నిలువరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిగా, తన అనుచరులు, కార్పొరేటర్లతో కలిసి కిట్టు అక్కడ వేచి ఉండగా.. పోలీసు అధికారి అనుచితంగా మాట్లాడటం వివాదానికి కారణమైంది.

వివాదానికి కారణమైన ఆ ఒక్క మాట!
మీ గవర్నమెంట్‌లోనూ కొట్టాం.. ఈ గవర్నమెంట్‌లోనూ కొడతాం అని విధుల్లో ఉన్న సీఐ అనడంపై కిట్టు తీవ్రంగానే స్పందించారు.
మీకు బందర్‌లో గత ప్రభుత్వ హయాంలో పోస్టింగ్ లేదు.. అసలు అప్పుడు ఎక్కడ కూల్చివేతలు జరిగాయి? ఏ మున్సిపల్ కమిషనర్ రక్షణ కోరితే మీరు వెళ్లారు? అబద్ధపు మాటలతో రెచ్చగొట్టింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.

కిట్టు సూటి ప్రశ్నలు
పోలీసు అధికారులపై ఏకవచన ప్రయోగం చేశారన్న విమర్శలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎస్పీ, డీజీపీ స్థాయి అధికారులు వయసులో చిన్నవారైనా తాము గౌరవిస్తామని, కానీ ఇక్కడ సీఐ తండ్రి వయసున్న వారిని కూడా లెక్క పెట్టకుండా మాట్లాడటం ఏంటని నిలదీశారు.నేను ఎవరి శరీరాన్ని అవహేళన చేయలేదు. అక్కడ ఎవరో వ్యక్తి చేసిన సైగలను ప్రశ్నిస్తే.. దాన్ని పోలీసులకు అన్వయించుకుని ఊహించుకుని తిడితే ఎలా?” అని జయపాల్ అనే వ్యక్తిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.అధికారులు చట్టాన్ని అమలు చేయాలి కానీ, పాత కక్షలను మనసులో పెట్టుకుని లేదా రాజకీయ రంగు పులుముకుని మాట్లాడటం తగదని పేర్ని కిట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బందర్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.