దేవుడు ఉన్నాడా? ఉంటే మనకు ఎందుకు ప్రత్యక్షం కాడు? – ఈ ప్రశ్న తరతరాలుగా వినిపిస్తూనే ఉంది. దీనిపై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వంగిపురం శశాంక్ చార్యులు ఖ్యాతి కనెక్ట్స్ ఇంటర్వ్యూలో విస్మయం కలిగించే విశ్లేషణ చేశారు. భగవంతుని ఉనికిని కేవలం నమ్మకంగానే కాకుండా, ప్రత్యక్ష నిరూపణలతో (Empirical Evidence) ఆయన వివరించారు.
దేవుడు ఉన్నాడని నమ్మడం ఎలా?
మనం గాలిని చూడలేం కానీ అనుభవిస్తాం, నిప్పును చూస్తాం, నీటిని తాగుతాం. అలాగే భగవంతుడు కూడా ఒక అనుభూతి అని శశాంక్ చార్యులు గారు పేర్కొన్నారు. భగవద్గీతలోని 18 అధ్యాయాల సారాంశాన్ని కేవలం 18 శ్లోకాలలో పొందుపరిచి, దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఆయన ప్రూవ్ చేశారు.
ఆత్మ – పరమాత్మ-శశాంక్ చార్యుల విశ్లేషణ
ఆత్మ నాశనం లేనిది: నైనం చిందంతి శస్త్రాణి.. శ్లోకం ద్వారా ఆత్మకు చావు లేదని, దాన్ని ఎవరూ కాల్చలేరని, నీటితో తడపలేరని వివరించారు. నాస్తికులు ఎవరైనా ఆత్మను నాశనం చేసి చూపిస్తే, అప్పుడు దేవుడు లేడని నమ్ముతానని ఆయన సవాల్ విసిరారు.
జనన మరణ చక్రం ప్రకారం పుట్టిన ప్రతి ప్రాణికి మరణం ఖాయమని, ఇది ప్రకృతి సిద్ధమని, ఈ సత్యాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు.మనిషి పతనానికి కారణాలు ముఖ్యంగా కోరిక మరియు కోపం
భగవద్గీత చెప్పిన సైకాలజీని ఆయన అద్భుతంగా వివరించారుమనిషికి కోరికలు అగ్ని లాంటివి, అవి ఎప్పటికీ తీరవు.కోరిక తీరకపోతే క్రోధం వస్తుందని వివరించారు.కోపం వల్ల మోహం కలుగుతుంది, తద్వారా మనిషి తన విచక్షణను (జ్ఞానాన్ని) కోల్పోయి నశించిపోతాడు.ఈ మానసిక స్థితిని నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారని, భగవంతుడు చెప్పిన ఈ సూత్రాలు అక్షర సత్యాలని ఆయన గుర్తుచేశారు.
చాతుర్వర్ణ వ్యవస్థ – అపోహలు vs వాస్తవాలు
సమాజంలో ఉన్న నాలుగు వర్ణాలను (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) భగవంతుడే సృష్టించారని, కానీ ఏ ఒక్కరూ ఎక్కువ తక్కువ కాదని ఆయన స్పష్టం చేశారు.ప్రతి ఒక్కరికీ ఒక బాధ్యత ఉంది. అది డాక్టర్, నర్స్ లేదా ఇతర సిబ్బందితో కూడిన హాస్పిటల్ వ్యవస్థ లాంటిది. ఒకరు లేకపోయినా వ్యవస్థ నడవదు.
శూద్రుల సేవ అంటే శూద్ర వర్ణం అంటే అంటరాని వారు కాదని, వారు సమాజానికి సేవ చేసే ‘ఇంజనీర్లు’ అని ఆయన కొనియాడారు.ఎవరి పని వారు సక్రమంగా నిర్వహించడమే భగవంతుడికి ఇచ్చే నిజమైన గౌరవమని, పరుల ధర్మం బాగుందని ఆశపడటం ప్రమాదకరమని శశాంక్ చార్యులు గారు హెచ్చరించారు. భగవంతుడు చెప్పిన మాటలు నిత్య జీవితంలో మనకు ఎదురవుతున్నప్పుడు, ఆయన లేడనే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన ముగించారు.