ఇన్ ఛార్జ్ కోసం టీడీపీ కేడర్ ఎదురు చూపులు.. నాయకుడు లేక పెరుగుతున్న విభేదాలు.. స్థానికేతరులకు నో ఛాన్స్ అంటున్న లోకల్ తమ్ముళ్లు.. పార్టీ సమావేశాల్లో సైతం పెరుగుతున్న రచ్చ.. అధిష్టానం కమిటీని కాదని సొంత కమిటీ ప్రకటించుకున్న నేతలు.. ఓటింగ్ విధానంలో కొత్త నాయకుడు కావాలన్న డిమాండ్.. టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్న ఆ నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడు లేకుండా పోయారట. పైగా… అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయని, అసలు ఇక్కడి పరిస్థితి చూస్తుంటే… మనం అధికార పార్టీలో ఉన్నామా, లేదంటే ప్రతిపక్షంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని పార్టీ కేడరే గుసగుసలాడుకుంటోందట.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. పి.గన్నవరం తెలుగుదేశం పార్టీలో ముదిరిన ముసలం! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా.. ఈ నియోజకవర్గానికి ఒక దిశానిర్దేశం చేసే నాయకుడు కరువయ్యారు. ఇప్పటికీ ఇన్‌ఛార్జ్‌ను నియమించకపోవడంతో పార్టీ కేడర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. అసలు మనం అధికార పక్షంలో ఉన్నామా? లేక ప్రతిపక్షంలో ఉన్నామా? అన్న సందేహం సామాన్య కార్యకర్తను సైతం వేధిస్తోంది. నాయకత్వ లేమితో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ముఖ్యంగా ‘స్థానిక’ నినాదం పార్టీలో అలజడి సృష్టిస్తోంది. “స్థానిక దళిత నాయకుడికే ఇన్‌ఛార్జ్ పదవి ఇవ్వాలి.. స్థానికేతరులను అస్సలు ఒప్పుకోం” అంటూ ఒక వర్గం భీష్మించుక కూర్చుంది. ఇదే క్రమంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. సమావేశం ఏదైనా.. చర్చల కంటే రచ్చలే ఎక్కువగా జరుగుతున్నాయి. వాగ్వివాదాలు కాస్తా ఘర్షణలకు దారితీస్తుండటంతో.. పి.గన్నవరం టీడీపీలో క్రమశిక్షణ గాలికి ఎగిరిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పరిస్థితి ఏ స్థాయికి చేరిందంటే.. పార్టీ అధిష్టానం పంపిన అధికారిక కమిటీని సైతం ధిక్కరించేలా! అధిష్టానం నియమించిన అధ్యక్షురాలిని బహిరంగంగా వ్యతిరేకించిన ఒక వర్గం.. తమకు తామే సొంతంగా మండల కమిటీలను ప్రకటించుకుని సంచలనం సృష్టించింది. మరోవైపు అధిష్టానం సూచించిన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంతో, నియోజకవర్గంలో రెండు వర్గాలు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. దీంతో పి.గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకలాపాలు గందరగోళంగా మారాయి. పార్టీ అధిష్టానం సిసలైన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం లేదన్న అసంతృప్తి కూడా పెరుగుతోంది.
ఓటింగ్ విధానంలోనే నాయకత్వాన్ని ఎంపిక చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. లేదంటే తామే గ్రామ స్థాయి కమిటీల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని హెచ్చరిస్తోంది పార్టీలోని ఒకవర్గం. ఇలాంటి వాతావరణంలో ప్రస్తుతం పి.గన్నవరం నియోజకవర్గంలో అంతర్గత వర్గపోరు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోందట. ఈ పరిస్థితిని సర్దుబాటు చేసి, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం పార్టీకి పెద్ద సవాలుగా మారిందని అంటున్నారు. కష్టమో, నిష్టూరమో….రిస్క్ తీసుకునైనా…. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని గాడిన పెడతారా? లేక అలాగే వదిలేస్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. ఈసారి పవర్‌లోకి వచ్చి దాదాపు రెండేళ్ళవుతున్నా…. ఇప్పటికీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్‌ని నియమించకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేదని కొందరు.. కాదు నాయకుడిని ఓటింగ్ ద్వారానే ఎన్నుకోవాలని మరికొందరు.. ఇలా డిమాండ్ల మీద డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే గ్రామ స్థాయి నుంచి ఎన్నికలు నిర్వహిస్తామని అధిష్టానానికే అల్టిమేటం జారీ చేస్తున్నారు నేతలు. ప్రస్తుతం పి.గన్నవరం అంతర్గత పోరను బాబు, లోకేష్‌లు ఎలా చక్కదిద్దుతారు? కఠిన నిర్ణయాలు తీసుకుని పార్టీని గాడిలో పెడతారా? లేక ఇలాగే వదిలేస్తారా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ముందు నుంచి కూడా ఇలాంటి వాతావరణమే ఉన్నా… ప్రస్తుతం వ్యవహారం బాగా ముదురుతోందని అంటున్నారు కార్యకర్తలు. ఈ పరిస్థితి కారణంగా స్థానిక నేతల మధ్య అసంతృప్తి అంతకంతకూ పెరిగిపోతోందట.
ముఖ్యంగా స్థానిక దళిత నాయకుడికే ఇన్ ఛార్జ్ పదవి ఇవ్వాలని పార్టీలోని ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. స్థానికేతరుల పేర్లు ప్రస్తావనకు వస్తేనే ఆ వర్గం మండిపడుతోంది. నియోజకవర్గంలోని మెజార్టీ కేడర్ అభిప్రాయం కూడా ఇదేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో….లోకల్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి, తమ్ముళ్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయట. తరచూ నిర్వహించే పార్టీ సమావేశాలు వాగ్వివాదాలతో రచ్చరచ్చగా మారుతుండటమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం కూడా నెలకొంటున్నట్లు సమాచారం. రానురాను పరిస్థితి ఇంకా దిగజారుతోంజేతప్ప… కొంచెం కూడా మెరుగుపడుతున్న సూచనలు కనిపించడం లేదన్నది నియోజకవర్గ కార్యకర్తల మాట. పార్టీ అధిష్టానం సూచించిన కమిటీని పట్టించుకోకుండా, ఒక వర్గం నాయకులు ముందుగానే తమ సొంత మండల కమిటీని ఎన్నుకుని ప్రకటించారు. అధిష్టానం ఎంపిక చేసిన అధ్యక్షురాలిని కూడా బహిరంగంగా వ్యతిరేకించారు.
మరోవైపు అధిష్టానం సూచించిన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంతో, నియోజకవర్గంలో రెండు వర్గాలు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. దీంతో పి.గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకలాపాలు గందరగోళంగా మారాయి. పార్టీ అధిష్టానం సిసలైన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం లేదన్న అసంతృప్తి కూడా పెరుగుతోంది. ఓటింగ్ విధానంలోనే నాయకత్వాన్ని ఎంపిక చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. లేదంటే తామే గ్రామ స్థాయి కమిటీల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని హెచ్చరిస్తోంది పార్టీలోని ఒకవర్గం. ఇలాంటి వాతావరణంలో ప్రస్తుతం పి.గన్నవరం నియోజకవర్గంలో అంతర్గత వర్గపోరు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోందట. ఈ పరిస్థితిని సర్దుబాటు చేసి, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం పార్టీకి పెద్ద సవాలుగా మారిందని అంటున్నారు. కష్టమో, నిష్టూరమో….రిస్క్ తీసుకునైనా…. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని గాడిన పెడతారా? లేక అలాగే వదిలేస్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.
చూశారుగా.. పి.గన్నవరం టీడీపీలో రచ్చ ఏ స్థాయికి చేరిందో! అటు ‘స్థానిక’ నినాదం.. ఇటు ‘ఓటింగ్’ డిమాండ్.. వెరసి పార్టీ రెండు ముక్కలై అధిష్టానానికే సవాల్ విసురుతున్నాయి. ఒక వర్గం సొంతంగా మండల కమిటీలను ప్రకటించుకోవడం చూస్తుంటే.. అక్కడ క్రమశిక్షణ గాలికి ఎగిరిపోయిందని అర్థమవుతోంది. మరి ఈ గందరగోళానికి చంద్రబాబు, లోకేష్‌లు ఎప్పుడు ఫుల్‌స్టాప్ పెడతారు? అసంతృప్త నేతలను బుజ్జగించి పార్టీని గాడిలో పెడతారా? లేక పి.గన్నవరం పరిస్థితి ఇలాగే ‘కంచే చేను మేసిన చందంగా’ మారుతుందా? వేచి చూడాలి