YS Jagan: జగన్ Next ప్లాన్‌ ఇదే! మావిగన్ (MAVIGAN) మాస్టర్‌మైండ్ ఎవరు..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి, అమరావతిని అధికారిక రాజధానిగా ముద్ర వేసినప్పటికీ.. వైసీపీ మాత్రం తన పంథా మార్చుకోవడం లేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన మావిగన్ ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ట్రెండింగ్‌ టాఫిక్‌గా మారింది. అసలు ఈ ‘మావిగన్’ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ చేస్తున్న ఈ కొత్త ప్లాన్‌ ఆయనకు రాజకీయంగా మేలు చేస్తుందా లేక మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుందా?

 

కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించడంతో, ఇక ఈ విషయంలో మార్పులు చేయడం అసాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. చట్టపరంగా, పరిపాలనాపరంగా అమరావతి స్థిరపడినప్పటికీ, వైసీపీ మాత్రం దీనిపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంది. రాజధానిపై క్లారిటీ వచ్చాక కూడా అడ్డంకులు సృష్టించడంమనేది వైసీపీ “దుస్సాహసమే” అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అమరావతికి మద్దతు పలికిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక తన నిర్ణయాన్ని మార్చుకోవడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.విభజన అనంతరం నవ్యాంధ్రకు రాజధానిగా విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని అమరావతి ఎంపిక చేసినప్పుడు, అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్ దీన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం” అని ప్రకటించారు. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేకనే ఈ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు ఆయన అప్పట్లో స్పష్టం చేశారు.

కనీసం 30 వేల ఎకరాల విస్తీర్ణంలో రాజధాని ఉండాలని కూడా ఆయన సూచించారు.అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చింది.విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించి రాష్ట్రంలో గందరగోళానికి తెరలేపారు.

 

 

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి, “ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని” అనే కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. విశాఖపట్నమే ఏపీకి అసలైన రాజధాని అని, త్వరలోనే అక్కడి నుంచే పాలన సాగిస్తానని ఘనంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే రుషికొండపై పర్యావరణ నిబంధనల నడుమ ఒక భారీ ప్యాలెస్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. మళ్ళీ తానే అధికారంలోకి వస్తాననే ధీమాతో పాలనను విశాఖకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.అయితే, ఎన్నికల ఫలితాలు జగన్ ఆశించిన దానికి భిన్నంగా వచ్చాయి.

 

గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడటమే కాకుండా, కనీసం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికి కావాల్సిన సీట్లు కూడా సాధించలేకపోయారు. ప్రస్తుతం ఆ హోదా కోసం పోరాడుతూనే, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకవైపు రాజధానిని మూడు ముక్కలు చేయాలని చూసిన వ్యూహం విఫలమవ్వడం, మరోవైపు స్వయంగా ముఖ్యమంత్రి కోసం కట్టుకున్న ప్యాలెస్‌లు వాడుకలో లేకుండా పోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

జగన్ ప్రతిపాదించిన ఈ కొత్త పేరుపై సోషల్ మీడియాలో భారీస్థాయిలో సెటైర్లు పేలుతున్నాయి. “మావిగన్” అంటే “మానసిక వికలాంగుడు జగన్” అంటూ ప్రత్యర్థులు మరియు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నెగిటివ్ ఎఫెక్ట్‌తో వైసీపీ ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు జగన్ తన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ‘మావిగన్’ ప్రతిపాదన అద్భుతమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారట. జగన్ మాటే వేదంగా భావించే వైసీపీ నేతలు, ఇప్పుడు ఈ పేరుపై పాజిటివ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సీనియర్ నాయకులు సైతం అమరావతి కంటే మావిగన్‌కే ప్రజా మద్దతు ఉందంటూ వాదిస్తుండటం గమనార్హం.

వైసీపీ శ్రేణులు ఈ మావిగన్ ప్రాజెక్టును ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా రాజధానిని నిర్మించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలు, భవనాలు, రోడ్లను అనుసంధానిస్తూ విస్తరిస్తే సరిపోతుంది. దీనికి కేవలం రూ. 20 వేల కోట్లు మాత్రమే ఖర్చవుతుందని వారు అంచనా వేస్తున్నారు.మూడు జిల్లాలు మచిలీపట్నం, ఎన్టీఆర్, గుంటూరు కలిపి ఒక పారిశ్రామిక, ఆర్థిక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని చెబుతుంది వైసీపీ. మావిగన్ ప్రతిపాదనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, ఇది చూసి టీడీపీలో వణుకు పుడుతోందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ ప్రచారంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వైసీపీ చేస్తున్న ఈ ‘మావిగన్’ హడావుడి సోషల్ మీడియాలో ట్రోల్ కంటెంట్ గా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాజిటివ్ మైలేజ్ కోసం చేస్తున్న ఈ ప్రయత్నం కాస్తా విమర్శలకు దారితీస్తోంది. అశాస్త్రీయమైన లెక్కలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారంటూ విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. గత ఐదేళ్లలో అభివృద్ధిని విస్మరించి, ఇప్పుడు ఎన్నికల వేళ ఇలాంటి కొత్త పేర్లతో రావడం హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

అమరావతి నిర్మాణాలు ఊపందుకున్న తరుణంలో వైసీపీ ‘మావిగన్’ పేరుతో కొత్త రాగాన్ని అందుకోవడం ఆ పార్టీకి రాజకీయంగా నష్టం కలిగిస్తుందని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తమ డిమాండ్‌కు ప్రజల మద్దతు లభిస్తోందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నప్పటికీ, అది కేవలం వారి ‘ఆత్మసంతృప్తి’ మాత్రమేనని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. గత పది రోజులుగా ఈ నినాదం తమకు వెయ్యి రెట్ల బలాన్ని ఇచ్చిందని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని చూసి రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇప్పుడు రాజధాని మార్పు లేదా ఎంపిక గురించి చర్చించాల్సిన సమయమే కాదని మెజారిటీ ప్రజల అభిప్రాయం.

 

చట్టబద్ధంగా అమరావతి రాజధానిగా స్థిరపడి, అక్కడ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్న వేళ, ఇలాంటి వింత పోకడలు వైసీపీ ఉన్న ఇమేజ్‌ను మరింత దెబ్బతీస్తాయని విమర్శలు వస్తున్నాయి. జగన్ ప్రతిపాదిస్తున్న ‘మావిగన్’ ప్రాంతం కూడా వాస్తవానికి సీఆర్డీయే (CRDA) పరిధిలోనిదే కావడం గమనార్హం. చుట్టుపక్కల గ్రామాలను కాదని, ఇప్పటికే రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్న నేషనల్ హైవే పరిసరాల్లోనే రాజధాని ఉండాలని కోరడం వెనుక ఉన్న మతలబు ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అమరావతిపై ఒక సామాజిక వర్గం ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ, ఇప్పుడు మచిలీపట్నం కాకుండా మావిగన్ ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మచిలీపట్నంలో కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ ఉంది. ఒకవేళ నేరుగా మచిలీపట్నాన్ని రాజధానిగా ప్రతిపాదిస్తే వ్యతిరేకత వస్తుందని భావించి, ‘మావిగన్’ పేరుతో కొత్త పల్లవి అందుకున్నారని టాక్. కాపులు అధికంగా ఉండే మచిలీపట్నాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోందనే ముద్ర వేయడానికి వైసీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ ప్రచారాన్ని తట్టుకోలేక, ఉనికిలో లేని ‘మావిగన్’ అనే పేరును వైసీపీ బలవంతంగా రుద్దుతోందని సెటైర్లు పేలుతున్నాయి. రాజధాని విషయంలో పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు, మారుస్తున్న పేర్లు సొంత పార్టీ శ్రేణులకే అర్థం కావడం లేదట. దీనివల్ల ప్రజల్లోకి వెళ్లేటప్పుడు స్పష్టత ఇవ్వలేక కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి, ఏపీ రాజధానిగా అమరావతి స్థిరపడి, అక్కడ పనులు పరుగులు పెడుతున్న తరుణంలో వైసీపీ ‘మావిగన్’ పేరుతో చేస్తున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించకూడదనే వాదన వినిపిస్తున్నప్పటికీ, రాజధాని విషయంలో పదేపదే మాట మార్చడం, కొత్త పేర్లు తెరపైకి తేవడం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తోంది. అటు సోషల్ మీడియా ట్రోల్స్, ఇటు విపక్షాల విమర్శల మధ్య ‘మావిగన్’ మంత్రం వైసీపీని గట్టెక్కిస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి.