సీఎం కాన్వాయ్‌లో కమలనాథుల షికార్లు.. ఆదిలాబాద్ హస్తం నేతల్లో మొదలైన గుబులు!

సాధారణంగా అధికార పార్టీ పర్యటనలు ఉంటే ప్రతిపక్ష నేతలు నిరసనలు తెలుపుతారు లేదా దూరంగా ఉంటారు. కానీ ఆ జిల్లాలో సీన్ పూర్తిగా రివర్స్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, అక్కడ హస్తం నేతల కంటే కమలం నేతల సౌండే ఎక్కువ వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మంత్రుల దాకా.. ఎవరు ఆ జిల్లాకు వచ్చినా ప్రోటోకాల్ పేరుతో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చేస్తున్న హడావుడి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది నిబద్ధతా? లేక వ్యూహాత్మక స్నేహమా? అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.అధికార పార్టీ నేతలకు మించి సీఎం, మంత్రులను పొగుడుతూ హస్తం నేతల టూర్లలో కమలం లీడర్లు జోరు అంటూ చర్చకు దారి తీస్తున్నారట. ఇంతకో ఏ జిల్లాలో ఈ పరిస్థితి..?

 

సీఎం, మంత్రుల టూర్లలో బీజెపీ లీడర్ల హల్చల్ అధికార పార్టీ ఎమ్మెల్యే ను మించి హడావుడి. రిసీవింగ్ నుంచి సెండ్ ఆఫ్ వరకు వాళ్ళదే హల్చల్ ఎంపి నగేష్, ఎమెల్యే పాయల్ శంకర్ తీరుపై చర్చ. ఆదిలాబాద్ జిల్లా (Adilabad BJP) బీజెపీ ప్రజా ప్రతినిధుల తీరు అధికార కాంగ్రెస్ లో చర్చకు దారి తీస్తోంది. గత ఏడాది కాలంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు సీఎం సహా మంత్రులు ఎవ్వరు వచ్చినా కాంగ్రెస్ నేతల కంటే బిజెపి ఎంపీ గోడం నగేష్ ,ఎమ్మెల్యే పాయల్ శంకర్(Poyal Shankar) తెగ హడావిడి చేసేస్తున్నారట స్వాగతం పలకడం మొదలు ఆ నేతల కాన్వాయిలోనే తిరుగుతూ పర్యటన ముగిసి సాగనంపే వరకు అన్ని తామై వ్యవహరిస్తున్నారట.

ఎంపి నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరుతో జిల్లా కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారట. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జ పటేల్ తో పాటు ఆదిలాబాద్ బోధు నియోజక వర్గ కాంగ్రెస్ ఇంచార్జులు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు డిసిసి అధ్యక్షుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందట. కనీసం తమ అగ్ర నాయకులకు శాలువా కప్పి ఒకే ఇచ్చి సన్మానం చేద్దామని అనుకున్న స్థానిక ఎంపీ, ఎమెల్యే ముందు వరుసలో ఉండడం వారి తర్వాతే జిల్లా హస్తం నేతల కు అవకాశం రావడం నిరాశకు గురి చేస్తోందట. అంతేకాదు కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో బీజెపీ ఎంపీ ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో కాంగ్రెస్ క్యాడర్ అసంతృప్తికి లోనవుతోందట.

 

ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ జిల్లా పర్యటనల సందర్భంగా సీఎం రేవంత్(CM Reventh Reddy) బీజెపీ ఎంపీ ఎమ్మెల్యేలను ఆకాశానికి ఎత్తడంతో వాళ్ళద్దరిపై పోటీ చేసి ఓడిన హస్తం నేత జీర్ణించుకోలేకపోతున్నారట. సీఎం రేవంత్ రెడ్డి సహా ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో పాటు ప్రభుత్వ పెద్దలతో హెలికాప్టర్లలో బీజెపీ ఎంపీ, ఎమ్మెల్యే చెక్కర్లు కొట్టడం జనాలలో పెద్ద చర్చకు దారి తీస్తోంది.

 

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ స్థలాన్ని పరిశీలించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేకు బయలుదేరగా ఆయనతో పాటు పట్టుబట్టి హెలికాప్టర్ ఎక్కారు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంత్రి వద్దని వారించిన పాయల్ శంకర్ హెలికాప్టర్ ఎక్కి చెక్కర్లు కొట్టడం చర్చనీయాంశం అయింది. ఎంపీ నగేష్ ,ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యవహార శైలి కాంగ్రెస్ నేతలను మించిపోతోందనే అభిప్రాయాలు లేకపోలేదు. ఈ బిజెపీ నేతల హడావిడి చూస్తుంటే అసలు కాంగ్రెస్ లీడర్లము తామా లేక వాళ్ళా అనే డౌట్ వచ్చేస్తుందట.

 

ప్రతిపక్షంలో ఉండాల్సిన నేతలు తమ అధికార పార్టీ నేతలతో కలిసిపోయి తిరుగుతూ ఉంటే ఇక తమ రాజకీయ భవిష్యత్తు పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారట ఆదిలాబాద్ జిల్లాలో ఐదు అసెంబ్లీ ఒక ఎంపీ సీటు ఉంటే అందులో నాలుగు ఎమ్మెల్యే సీట్లను ఓ ఎంపీ సీటును బిజెపీ గెలిచింది. మిగిలిన ఒక్క సీటును కాంగ్రెస్ సొంతం చేసుకుంది. జిల్లాలో బీజెపీ అంత బలంగా ఉండి పార్టీ బలోపేతం కోసం ప్రయత్నించాల్సిన నేతలు సీఎం మంత్రుల పర్యటనల్లో అత్యుత్సాహం చూపించడం కమలం క్యాడర్కు కూడా నచ్చట్లేదట.

 

ఇదే జిల్లాకు చెందిన మరో బిజెపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు(Palvai Harish Babu) ఏకంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట వేసి వార్తల్లోకి ఎక్కారు. ఇలా నేతలంతా సొంత ఎజెండాగా పని చేస్తున్నారని కాంగ్రెస్ కానీని మోస్తున్నారని కార్యకర్తలు రగిలిపోతున్నారట. అటు కాంగ్రెస్ నేతల పరిస్థితి అయితే పవర్ లో ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నామో తెలియని పరిస్థితి అంటున్నారు. తమ పార్టీ సీఎం మంత్రులు విపక్ష ఎంపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన టైం కూడా తమకు ఇవ్వట్లేదని మదన పడుతున్నారట. బీజెపీ నేతలే కాంగ్రెస్ (Telangana Congress) కు దగ్గర కావాలనుకుంటున్నారో లేకపోతే కాంగ్రెస్ పెద్దలే కమలం లీడర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎన్నికల టైం వస్తే తప్ప బయటపడే పరిస్థితి లేదంటున్నారు కాంగ్రెస్, బీజెపీ క్యాడర్.

ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీకి 4 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు ఉన్నాయి. ఇంత బలంగా ఉండి కూడా సొంత పార్టీ బలోపేతం కంటే అధికార పార్టీ నేతలతో చెట్టాపట్టాల్ వేసుకోవడం వెనుక ఏదైనా బలమైన పొలిటికల్ స్కెచ్ ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు(Palvai Harish Babu) మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయడం ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తోంది.బీజేపీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? లేక కాంగ్రెస్ పెద్దలే కమలం నేతలకు గాలం వేస్తున్నారా? అనేది తేలాలంటే రాబోయే ఎన్నికల వరకు ఆగాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం ఆదిలాబాద్‌లో పార్టీ ఏదైనా.. పవర్ మాదే అన్నట్లుగా సాగుతోంది కమలనాథుల తీరు!