క్లైమాక్స్ అనుకున్న చోటే అసలు ట్విస్ట్ మొదలైంది! ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇక ముగిసిపోతుంది, చార్జ్ షీట్తో కథ కంచికే అనుకుంటున్న తరుణంలో.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రకంపనలు సృష్టించింది. నిన్నటి వరకు సిట్ విచారణతో ఉక్కిరిబిక్కిరి అయిన నిందితులకు, ఇప్పుడు ఈడీ సడన్ షాక్ ఇచ్చింది. ఐదుగురు కీలక వ్యక్తుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేయడంతో, ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఇది కేవలం సోదాలేనా? లేక లిక్కర్ స్కామ్లో భారీ నెట్వర్క్ను కూల్చేందుకు వేసిన మాస్టర్ ప్లానా?ఈడి దూకుడుతో లిక్కర్ కేసులో పార్ట్ 2 ఉండబోతోందా.? ట్విస్ట్ లే ట్విస్టులు రోజుకో మలుపు ఆ కేసు తెరమీద వచ్చినప్పటి నుంచి ప్రతి డెవలప్మెంట్ సంచలనమే అరెస్టుల నుంచి రిమాండ్ల దాకా నిందితుల బెయిల్ పిటిషన్ల నుంచి డీఫాల్ట్ బెయిల్ వరకు బెయిల్స్ రద్దు నుంచి సిట్ ఆర్గ్యుమెంట్స్ వరకు అంతా నెక్స్ట్ లెవెల్ హీట్ ను క్రియేట్ చేసింది.
ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తే నిందితులకు పెద్ద చిక్కులను తెచ్చిపెట్టింది. అంటే అంతకుమించి అన్నట్లుగా ఇప్పుడు ఈడీ దూకుడు పెంచడంతో ఐదుగురు కీలక నిందితుల ఇళ్లలో సోదాలు చేయడం ఇంట్రస్టింగ్ డెవలప్మెంట్ గా మారింది. రాజ్ కసిరెడ్డి, వైసీపి నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్, తిరుపతిలోని వారి నివాసాలతో పాటు ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మాజీ ఎంపి విజయసాయి రెడ్డి నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది జనవరిలో కూడా విజయ సాయి రెడ్డిని ఈడి విచారించింది.
మధ్యం అక్రమాలు షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో పాటు ఆయన పాత్రపై ఈడీ ఆరాతీసింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ కేసులో ఎంటర్ అయిన ఈడి అప్పుడే ఐదు రాష్ట్రాల్లో రైడ్స్ చేసింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ రైడ్స్ జరగడం అప్పట్లోనే నిందితులను ఆందోళనకు గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీమే దర్యాప్తు చేస్తూ ఉండగానే మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడి దూకుడు పెంచడం చూస్తుంటే ఏపీ లిక్కర్ కేసు ఎటువైపు టర్న్ తీసుకుంటుందన్న ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు లేటెస్ట్ గా ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సిట్ నోటీసులు ఇచ్చింది.
వేల కోట్ల ముడుపులు విదేశీ లింకులు హవాలా లావాదేవీలు అంటూ ఆరోపణలు ఉన్న ఈ కేసులో ఈడీ రైడ్స్ చేయడం పైగా ఐదుగురు కీలక నిందితుల టార్గెట్ గానే సోదాలు చేయడం సంచలనంగా మారింది. త్వరలోనే ఈ కేసుపై సిట్ పూర్తి స్థాయి చార్జ్ షీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ స్టేజ్ లో ఈడీ స్పీడ్ పెంచడం చూస్తుంటే లిక్కర్ లింకులు నిందితులకు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది.సిట్ నమోదు చేసిన కేసుల్లో రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు మరికొందరు బెయిల్ మీద ఉన్నారు. గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి డీఫాల్ట్ బెయిల్ రాగా హైకోర్టు కొట్టేసింది. రెగ్యులర్ బెయిల్ విషయంలో సుప్రీం కోర్టులో విచారణ పెండింగ్ లో ఉంది. ఆ ఎలిగేషన్స్ అలా కొనసాగుతూ ఉండగానే ఈడీ సోదాలు నిందితులకు తలనొప్పిగా మారాయి.
మనీ లాండరింగ్ అంటూ ఈడీ కేసులు నమోదు చేస్తే ఈ కేసు మరింత జటిలమయ్యేలా కనిపిస్తోంది. ఈడీ దర్యాప్తు స్పీడ్ అప్ కావడంతో ఈ కేసు ఎవరి టార్గెట్ గా ముందుకు కదులుతుందని ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్న కీలక వ్యక్తులందరూ అరెస్ట్ అయ్యారు. అందులో కొందరు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. ఇంకా ముగ్గురు నలుగురికి సిట్ కేసుల్లో బెయిలు రావాల్సి ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 3500 కోట్ల కుంభకోణం జరిగిందనేది సిట్ మెయిన్ ఎలిగేషన్. అయితే ఇక్కడ లిక్కర్ సేల్స్ తో వచ్చిన నిధులను హవాలా రూపంలో విదేశాలకు పంపి బ్లాక్ మనీని వైట్ చేశారు అన్నది ఈడీ ప్రధాన అభియోగం. ఇప్పటివరకు సిట్ దాఖలు చేసిన చార్జ్ షీట్ లోని నిందితుల ఆస్తులు కంపెనీలపై ఈడీ అధికారులు ఆరాధిస్తున్నారట.
మద్యం అమ్మకాలతో వచ్చిన ముడుపులను షెల్ కంపెనీలకు మళ్లించి లబ్ది పొందినట్లు ఈడి గుర్తించినట్లు టాక్ ఆల్ మోస్ట్ లిక్కర్ కేసు చివరి దశకు చేరుకుంటుంది అనుకుంటున్న టైంలో ఈడి ఎంటర్ దూకుడైతే బిగ్ టర్న్ గా చెప్పొచ్చు. ఈడి వేట లిక్కర్ లింకులను ఎలా తెంచుతుందో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఇరుక్కోబోతున్నారు.
మొత్తానికి ఏపీ లిక్కర్ కేసు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. కేవలం మద్యం అమ్మకాల్లో అక్రమాలే కాదు, వేల కోట్ల రూపాయల విదేశీ లావాదేవీల చిక్కుముడిని విప్పేందుకు ఈడీ సిద్ధమైంది. సిట్ దర్యాప్తు ఒక ఎత్తు అయితే, ఈడీ దూకుడు మరొక ఎత్తు. ఈ సోదాల్లో దొరికిన ఆధారాలతో మరికొంతమంది అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది. లిక్కర్ సిండికేట్ లింకులను ఈడీ పూర్తిగా తెంచేస్తుందా? లేక ఈ కేసులో ఇంకా ఎన్ని సంచలన మలుపులు రాబోతున్నాయి? అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.