సినిమాల్లో పవర్ ఫుల్ ఇమేజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయశాంతి, రాజకీయాల్లో స్థిరపడలేకపోయారు. తెలంగాణా ఉద్యమ సమయంలో ఆమె సొంత పార్టీ ద్వారా రాజకీయ రంగంలో అడుగు పెట్టిన తర్వాత, ఆ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేసి, అప్పట్లో టీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు.విజయశాంతి తన స్పీచ్‌లలో పంచ్ డైలాగ్‌లను విసురుతూ మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ, రాజకీయ పరిణామాలతో పార్టీ మార్పులు జరిగాయి, చివరికి ఆమె హస్తం నీడకు చేరి ఎమ్మెల్సీ పదవి పొందగలిగారు.ఎమ్మెల్సీ పదవి పొందిన తర్వాత ఆమె సైలెంట్‌గా మారిపోయారు. ఈ మధ్య, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రెస్టీజియస్‌గా తీసుకుని పావులు కదుపుతున్నప్పటికీ, విజయశాంతి ఎక్కడా కనిపించడం లేదు.కాంగ్రెస్‌లో చేరినప్పుడు, బాధ్యతలు ఇస్తే కాదా పని చేయాలనిపిస్తుంది అని చెప్పిన ఈ లేడీ, ఇప్పుడు పదవి తీసుకున్నాక సైలెంట్ ఎందుకయ్యారు..? ఈరోజు పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం
మాజీ స్టార్ హీరోయిన్ విజయశాంతి, తెలంగాణ ఉద్యమ సమయంలో తనవంతు పాత్ర పోషించారు. తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పలు పోరాటాల్లో ముందుండి పోరాడారు. ఆ సమయంలో, రాష్ట్ర సాధన కోసం తమ పార్టీని అప్పటి టీఆర్ఎస్లో విలీనం చేశారు. కేసీఆర్‌ను “దేవుడిచ్చిన చెల్లెలు” అనిపించుకునే విజయశాంతి, ఆ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అఫ్ కోర్స్ అదే మొదటి సారి ఆమెకి చివరిసారి కావచ్చునని అనుకోవచ్చు – అది వేరే విషయం.తర్వాత గులాబీ పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కొని, చివరకు బయటకు వచ్చారు. అయినప్పటికీ, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో “లేడీ అమితాబ్” అని పిలిచే రాములమ్మ, అదే ఇమేజ్‌తోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు.అయితే, ఒక్కప్పుడు ఫైర్ బ్రాండ్ అయిన ఆమె, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయ్యాక కూడా సైలెంట్‌గా ఉండటం పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
2023 అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు రాములమ్మ, కమలం పార్టీని విడిచి, మరోసారి హస్తం గూటికి చేరారు. స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్నికల ప్రచారంలో నిష్ఠతో పాల్గొన్నారు.అయితే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా కనిపించలేదు. కనీసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ఆమె మాట్లాడలేదు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడం కూడా మానేశారు.అదే సమయంలో, రాజకీయాల్లో ఆమె పని అయిపోయిందంటూ చర్చలు జరిగుతున్నప్పటికీ, సడన్‌గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అయ్యారు. ఆ రోజులలో ఎందుకు మౌనంగా ఉన్నారో, పార్టీకి దూరంగా ఉన్నారో అడిగితే, రాములమ్మ మాట్లాడుతూ,“మనకంటూ ఏవైనా బాధ్యతలు అప్పగిస్తే కదా, పని చేయడానికి” అని చెప్పారు. ఇప్పుడు, పార్టీ ఆమెకు బాధ్యతలు ఇచ్చింది, అందుకే బాధ్యతగా పనిచేస్తానని ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్టార్ క్యాంపెయినర్ కనిపించడం లేదట.
వాస్తవానికి, విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినప్పుడు కాంగ్రెస్‌లో అనేక విమర్శలు వచ్చాయి. ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ 2017 నుండి పార్టీ లో ఉన్నవారికే పదవులు ఇవ్వాలని, బాధ్యతలు అప్పగించేవారినే నిర్ణయిస్తారని ప్రకటించారు. ఇప్పటికీ, పార్టీ కార్యవర్గాల ఏర్పాటులో అదే విధానాన్ని ఫాలో చేస్తున్నారంటున్నారు.అయితే, రాములమ్మ 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి కమలం గూటికి చేరారు. గులాబీ పార్టీలో మెదక్ ఎంపీగా గెలిచిన ఆమెను, తర్వాత కేసీఆర్ పక్కన పెట్టేయడం వల్ల కాంగ్రెస్ పంచకు చేరారు. తరువాత, ఆమె కాషాయకండువా కప్పుకుని కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం, అది బీజేపీతోనే సాధ్యమని తీవ్ర స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో అంత ప్రాధాన్యం లేదు అని తేలిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే, రాములమ్మ ప్లేట్ ఫిరాయించి, యూటర్స్ తీసుకుని తిరిగి హస్తం నీడకు చేరారు.
ఇప్పటికీ ఒక ప్రశ్న.. ఆమెకు కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ పదవి ఎలా దక్కింది?పార్టీ కోసం పని చేస్తున్న అనేక మంది సీనియర్లు ఉన్నప్పటికీ, వారిని కాకుండా రాములమ్మను శాసనమండలికి ఎంపిక చేయడంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.ఎలాగోలా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న తర్వాత, రాములమ్మ నిజానికి యాక్టివ్‌గా ఉండలేదని అవస్థ. పదవి వరిన తర్వాత, బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు విజయశాంతి గట్టి కౌంటర్స్ ఇస్తారని అందరూ ఊహించారు.
గులాబీ నేతలకు రాములమ్మ బారాబర్ కౌంటర్లు ఇస్తారని కూడా కాంగ్రెస్ శ్రేణులు భావించారు. గులాబీ పార్టీలో ఎదుర్కొన్న అవమానాలను ఆమె గుర్తు చేసుకుని, తిరిగి తీర్చుకుంటారని అనుకున్నారు. కేసీఆర్‌ను రాజకీయంగా దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి, ఆయన్ను టార్గెట్ చేయడం ఖాయమని అందరూ ఊహించారు.
కానీ, ఆమె నోరు విప్పలేదు. చివరికి, బీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసినప్పుడు, ఎమ్మెల్సీ రాములమ్మ తనకు సంబంధం లేనట్టు ఉండటం తీవ్ర విమర్శలకు కారణమైంది.
పహాల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వం నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో రాములమ్మ మాత్రం అటెండెన్స్ ఇచ్చారు. బీసీ బిల్లును గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపిన సందర్భంలో బీసీ నాయకులు గవర్నర్‌కు ధన్యవాదాలు చెప్పడానికి వెళ్ళిన సమయములో ఆమె కనిపించారు.అయితే, పార్టీపై ప్రత్యర్థుల విమర్శలను తిప్పకొట్టడం, ప్రభుత్వ పథకాల ప్రచారం వంటి వాటిలో టచ్ మీ నాట్ స్థితి చూపిస్తున్నారు. అంటే, ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షాలపై ఘాటు కామెంట్స్ చేసి సర్కార్‌కు సపోర్ట్ ఇవ్వరు అని అనుకుంటే, అది లేవు. దాంతో, పార్టీ వర్గాలు “రాములమ్మా… ఎక్కడమ్మా” అని చర్చిస్తున్నాయి. మరోవైపు, ఎమ్మెల్సీ కాదు, విజయశాంతి పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పదవి వచ్చిన తర్వాతే మౌనం వీడుతారేమో అని రాములమ్మపై సెటైర్లు వినిపిస్తున్నాయి.