కృష్ణా జిల్లాలో ఓటమి తర్వాత ఆ పొలిటికల్ ఫైర్ బ్రాండ్స్ ఇద్దరూ.. వర్కింగ్ స్టైల్ మార్చారా? పొలిటికల్ రీఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా ఆ లీడర్స్ ప్లాన్ చేస్తున్నారా? ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన తప్పిదాలు ఫ్యూచర్ లో రిపీట్ కాకూడదని సరికొత్త స్ట్రాటజీని అమలు చేసేందుకు వారిద్దరూ ఇప్పటి నుంచే ఎన్నికలకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారా? నియోజక వర్గాల్లో పునర్వైభవం సాధించేందుకు ఎలాంటి వ్యూహంతో వారిద్దరూ ఎలా ముందుకు వెళ్తున్నారు? ఇంతకీ ఓటమి తర్వాత వారిద్దరిపై కూటమి ఫోకస్‌తో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొత్త ప్లాన్‌తో నియోజకవర్గాల్లో వారిద్దరూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఏపీ పాలిటిక్స్ లో వైఎస్ఆర్సీపీ(YSRCP) నుంచి వారిద్దరూ ఫైర్ బ్రాండ్స్ కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ మోడ్ లోకి వచ్చేశారు. అంతేకాదు జగన్‌ని మళ్ళీ సీఎం చేసే వరకు విశ్రమించేది లేదని అంటున్నారు మిత్ర ద్వయం. దీంతో ఆయా నియోజక వర్గాల్లోని వారి అనుచరులతో పాటు వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఫుల్ జోష్ లో ఉందట. కృష్ణా జిల్లాకు చెందిన ఆ ఇద్దరు వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani), మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabhaneni Vamshi). వీరిద్దరూ మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లో తమ మార్కు చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వంశీ నియోజక వర్గాన్ని చుట్టేస్తుండగా ఇప్పుడు నాని కూడా తన మార్కు చూపించేందుకు సిద్ధం కావడం నియోజక వర్గ వైఎస్ఆర్సీపీలో జోష్ నింపుతోందట. కొడాలి నాని గుడివాడ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా ఐదోసారి ఓటమి పాలయ్యారు. వంశీ టిడిపి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన గత ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలయ్యారు. 2019 నుంచి 2024 వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశి ఇద్దరు కూడా టిడిపిని, చంద్రబాబు సహా లోకేష్ ఇతర టీడీపీ నేతలందరినీ చెడుగుడు ఆడేశారనే కోపం వారిలో ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీరిపై ఫోకస్ పెట్టింది.
2019లో టీడీపీ తరుఫున గెలిచిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాతి కాలంలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడిగా మారాడు. టీడీపీ(TDP) అగ్ర నేతలపై తన మార్క్ కామెంట్స్‌తో పొలిటికల్ హీట్ పెంచారు. కట్ చేస్తే.. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో.. వంశీపై దాదాపు 17 కేసులు నమోదు కావడంతో, ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఒక దశలో అసలు వంశీ బయటకు వస్తారా..? అనే పరిస్థితి ఏర్పడింది.
జైలులో కొన్ని నెలలు గడిపి అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన వంశీ, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బాగా సన్నబడి.. జుట్టుకు కలర్ వేయకుండా పూర్తిగా మారిపోయిన వంశీ.. ఆ తర్వాత కూడా అదే లుక్ కంటిన్యూ చేశారు. ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా, ఇంటికే పరిమితమై కోర్టు కేసులపైనే దృష్టిని కేంద్రీకరించారు.అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే.. అవన్నీ కేవలం రూమర్స్‌గానే కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో క్రమంగా చురుకుగా మారుతున్నారు. ఇటీవల వంశీ మళ్లీ రాజకీయాలను సీరియస్‌గా తీసుకుంటున్నారనే అభిప్రాయం అందరిలో కలుగుతోంది. పలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నరన్న భావన వంశీ అనుచరుల్లో నెలకొంది.
తన స్టైల్ కి భిన్నంగా కొత్త పొలిటికల్ స్ట్రాటజీతో వల్లభనేని వంశీ ముందుకు సాగుతున్నారట. గన్నవరంలో(Gannavaram) కేసులతో ఇబ్బందులు పడ్డ తన అనుచరుల ఇళ్లకు వెళ్లి వంశీ ఓదారుస్తున్నారట. అంతేకాకుండా వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలతో పాటు రాజకీయ దాడులకు గురైన కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శలు చేస్తున్నారు. గన్నవరంలో వరుసగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పర్యటిస్తున్నారు. తనకు ఎవరైనా టీడిపి నేతలు కనిపిస్తే పలకరించి మాట్లాడుతున్నారట. స్థానిక పరిస్థితులపై ఆరా తీస్తున్నారట. అయితే, స్థానికంగా వల్లభనేని వంశీ వ్యవహరిస్తున్నతీరు పార్టీ నేతలకు కూడా సర్ప్రైజ్గా ఉందట. స్థానిక నేతలకు కూడా సమాచారం ఇవ్వకుండా వంశీ పర్యటిస్తున్నారట. దీంతో ఆయన ఎందుకు అలా చేస్తున్నారు అనేదే సస్పెన్స్ గా మారింది.
జైలు నుంచి విడుదలయ్యాక ప్రజా సమస్యలపై వంశీ పర్యటనలు ప్రారంభించారట. గన్నవరం పరిధిలోనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మచిలీపట్నం కలెక్టరేటుకు వెళ్ళారు. బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో 2400 ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు అందించాలని కలెక్టర్‌కు అర్జీ అందించారు. ఇక గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు అమరావతిలో ఇస్తామన్న పట్టాలు ఇవ్వాలని బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.ఇలా ప్రజాసమస్యలపై వంశీ వేగంగా ముందుకు వెళ్తుండటంతో గన్నవరం రాజకీయ వర్గాల్లో డిబేట్ రన్ అవుతోందట. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి మళ్ళీ విజయం సాధించడం కోసం వంశీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని అనుచరులు అంటున్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని కూడా రాజకీయాల్లో యాక్టివ్ అవ్వటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నియోజక వర్గంలో పెద్దగా అందుబాటులో లేని నాని.. పార్టీ ఆదేశాలతో మెడికల్ కాలేజీలపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతేడాది ఆరు నెలలు పాటు హార్ట్ సర్జరీతో విశ్రాంతి తీసుకున్నారు. వైద్యులు సలహాతో మరో ఆరు నెలలు రెస్ట్ తీసుకునున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, అక్రమ వేధిపులపై పోరాటం చేస్తానని అనుచరులతో కొడాలి నాని స్పష్టం చేశారు. జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసే వరకు పని చేస్తానని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ జైలుకు వెళ్ళగా కొడాలి నాని అనారోగ్య సమస్యలకు శస్త్ర చికిత్స కారణంగా నియోజక వర్గానికి దూరంగా ఉన్నారు. నియోజక వర్గాల్లో అగ్రనేతలు అందుబాటులో లేకపోవడంతో క్యాడర్ కూడా గందరగోళానికి గురైంది. ఇద్దరు నేతల ప్రధాన అనుచరులు కూడా అనేక కేసులలో అరెస్ట్ అయ్యారు. వల్లభనేని వంశీ అయితే సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ఆయన అనుచరుల్లో చాలా మంది జైల్లోనే ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా వంశి తిరిగి నియోజక వర్గంలో యాక్టివ్ అవుతున్నారు. తన క్యాడర్ ను కాపాడుకోవడంతో పాటు జైల్లో ఉన్నవారిని జైలుకు వెళ్తున్న వారికి కూడా అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు వంశీ. పార్టీ కార్యక్రమాలతో పాటు నియోజక వర్గంలో అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ సుడిగాలి పర్యటన చేస్తూ మళ్ళీ వంశీ బిజీ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమికి సంబంధించి కారణాలు గుర్తించి వాటిని సరిచేసుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలుపునకు కూడా ఆయన ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నారు.
యాంకర్ వాయిస్: టీడీపీ నేతలని ఒక రేంజ్లో మాస్ ర్యాగింగ్ చేసిన వైఎస్ఆర్సీపీ నేతల్లో మొదట వినిపించే పేర్లు.. కొడాలి నాని, వల్లభనేని వంశీలదే. దీంతో ఇద్దరిని అధికారంలోకి వచ్చిన తర్వాత సపరేట్ గా డీల్ చేయాలని టీడిపి పార్టీ క్యాడర్ కూడా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చింది. ఇప్పటికే వంశీ తిరిగి యాక్టివ్ అయ్యారు.కొడాలి నాని కూడా పూర్తిస్థాయిలో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెడతానని ప్రకటించటమే కాదు..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో వీరిద్దరి వ్యవహారంలో కూటమి ఎలా వ్యవహరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.