ఒకప్పుడు అన్న కోసం అడుగులు వేసింది.. అన్న రాజన్న బిడ్డగా జనం గుండెల్లో నిలిచేలా ‘మరో ప్రజా ప్రస్థానం’ సాగించింది. కానీ కాలం మారింది.. ఇప్పుడు కథ మారింది! నాడు అన్నకు అండగా నిలిచిన అదే పాదాలు, నేడు అదే అన్నకు వ్యతిరేకంగా కదం తొక్కబోతున్నాయి. ఆస్తుల పంచాయితీ నుంచి రాజకీయ ఆధిపత్యం వరకు.. వైఎస్సార్ కుటుంబంలో రాజుకున్న చిచ్చు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పాదయాత్రల యుద్ధానికి దారితీస్తోంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వర్సెస్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. ఇప్పుడు ఇద్దరి టార్గెట్ ఒక్కటే, అది ఏపీ రాజకీయం!
జగన్ వర్సెస్ షర్మిలా ఒకేసారి పాదయాత్ర మ్యాటర్ ఏదైనా జగన్ ను వదలని వైయస్ షర్మిలా వైసీపి అధినేతగా జగన్ కాంగ్రెస్ స్టేట్ చీఫ్ గా షర్మిలా(Ys Shrmila) జనం బాట రాజకీయ ప్రత్యర్థులు పోటాపోటి పాదయాత్రలు ఏపీ పొలిటికల్ సినారియోలో చిత్ర విచిత్రమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి.ఒకే కుటుంబం అందులోనూ ఎంతో పేరున్న వైఎస్సార్ ఫ్యామిలీలో అన్న చెల్లెళ్లు ఇద్దరూ విడివిడిగా రాజకీయాలు చేస్తున్నారు.
ఏ కుటుంబంలో అయినా రెండు పార్టీలు వేరు రాజకీయాలు చేయడం ఈ రోజుల్లో కామనే కానీ ఏపీ అలా కాదు. షర్మిలా ఏకంగా తన సోదరుడు జగన్ (YS Jagan) మీదనే రాజకీయ దాడి చేస్తున్నారు. వైసీపీ ని పూర్తిగా తగ్గించాలని ఆమె రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే షర్మిలా జగన్ వైసీపీ నే టార్గెట్ చేయడానికి జగన్ కు పోటీగా పాదయాత్రకు ప్లాన్ చేయడం వెనుక రెండు మూడు కారణాలు ఉన్నాయట.
ఇప్పటికే ఆస్తుల పంచాయితీతో అన్నతో డి అంటే డి అంటోంది షర్మిలా. ఇక రెండో విషయం ఏంటంటే ఏపీపిసిసి చీఫ్ గా ఉన్న షర్మిలా తనను తాను పొలిటికల్ లీడర్ గా ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారట. ఇందుకోసమే వైసీపి(YSRCP) ఓటు బ్యాంకు ను చీల్చే ప్లాన్ చేస్తున్నారట. ఫ్యాన్ పార్టీ లీడర్లు క్యాడర్ అంతా కాంగ్రెస్ (AP Congress) నుంచి వచ్చినవారే.వైఎస్సార్ చరిష్మా కూడా వైసీపీ కి మరో అడ్వాంటేజ్. వైసీపి వైపు షిఫ్ట్ అయిన కాంగ్రెస్ ఓట్ బ్యాంకు లీడర్లను తిరిగి హస్తం పార్టీ వైపు అట్రాక్ట్ చేయడంతో పాటు తనది కూడా వైయస్సార్ వారసత్వం అంటూ జగన్ ను కార్నర్ చేయడం షర్మిలా తొలి ఎజెండాగా చెబుతున్నారట.
పైగా కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ గా తన పోస్టును అధిష్టానం దగ్గర పలుకుబడిని పెంచుకునే వ్యూహంలో భాగంగా అన్నకు పోటీగా పాదయాత్రకు వ్యూహాలు రచిస్తున్నారట షర్మిలా వైసపి అధినేత జగన్ వచ్చే ఏడాది పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.2029 లో జరిగే ఎన్నికలు వైసపీ కి డూ ఆర్ డై తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈసారి కనుక గెలిస్తే వైసపీ మరింత బలంతో దీర్ఘకాలం కొనసాగుతుంది. పొరపాటున ఓడితే మాత్రం ఇంకా పట్టు సడలిపోయే ప్రమాదం ఉందనేది ఫ్యాన్ పార్టీ నేతలే చర్చించుకుంటున్న పరిస్థితి.
దాంతో వైసీపి అధినాయకత్వం ఈ ఎన్నికలను చాలా సీరియస్ గానే తీసుకుంటుంది. జగన్ పాదయాత్రతో ఈసారి ఏపీ లోని ప్రతి మండల కేంద్రాన్ని టచ్ చేసేలా రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. గ్రామ స్థాయి నుంచి ప్రతి చోట ప్రతి ఏరియాను టచ్ చేయాలని జగన్ చూస్తున్నారు. ఏకంగా 5000 కిలోమీటర్లకు పైగా సుదీర్ఘమైన పాదయాత్రకు జగన్ సిద్ధపడుతున్నారని వైసీపి నేతలు హైపిస్తున్నారు.
2027లో వైఎస్సార్ జయంతి రోజైన జూలై 8 నుంచి పాదయాత్ర స్టార్ట్ చేయాలనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.2029 ఎన్నికల ముందు వరకు పాదయాత్ర కొనసాగుతుందని అంటున్నారు. జగన్ పాదయాత్ర అన్నది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఉండేలా వైసీపి వ్యూహాలు రచిస్తోంది. అయితే అదే సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఏపీ పాలిటిక్స్ లో చెక్కర్లు కొడుతోంది. పిసిసి చీఫ్ షర్మిలా కూడా పాదయాత్రకు సిద్ధపడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె కూడా జగన్ పాదయాత్రకు కాస్త ముందు వెనకో పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్ళాలని అనుకుంటున్నారట. షర్మిలా ఉమ్మడి ఏపీలో జగన్ జైలులో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు.
చేవేళ్ల టు ఇచ్చాపురం పేరుతో ఆమె నాడు పాదయాత్ర వైసీపీ కోసం చేశారు. ఆ తర్వాత లో తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిలా భారీ పాదయాత్ర చేశారు. దాంతో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆమె పాదయాత్రకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. పైగా జగన్ పాదయాత్రకు పోటీగా షర్మిలా పాదయాత్ర సాగితే కనుక ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా అన్నా చెల్లెళ్లు ఒకేసారి పాదయాత్ర చేస్తే మాత్రం పొలిటికల్ స్క్రీన్ పై డైలాగులు పేలే అవకాశం లేకపోలేదు. జగన్ కూటమిని టార్గెట్ చేస్తే షర్మిలా మాత్రం తన అన్నయ్యే లక్ష్యంగా విమర్శల దాడి చేయడం పక్కా అన్న గుసగుసలు మొదలయ్యాయి.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది పాత మాట. కానీ, రక్త సంబంధీకులే రాజకీయ ప్రత్యర్థులుగా మారి ఒకే బాటపై పోటీ పడటం ఏపీ రాజకీయాల్లో ఒక అరుదైన మరియు చిత్ర విచిత్రమైన సన్నివేశం. జగన్ జనంలోకి వెళ్లి తన అధికారాన్ని కాపాడుకోవాలని చూస్తుంటే, షర్మిల అదే జనంలోకి వెళ్లి అన్నను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. అన్నా-చెల్లెళ్ల ఈ పోటాపోటీ యాత్రలు ఏపీ పొలిటికల్ స్క్రీన్‌పై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి. 2027 నుంచి ఏపీ రాజకీయాల్లో ‘పాదయాత్ర’ హీట్ మామూలుగా ఉండబోదని అర్థమవుతోంది!