గత వారం రోజుల నుంచి ఐదు కోట్ల మంది ప్రజలు ముఖ్యంగా తెలుగు జాతి ఆనందోత్సవాల మధ్యన ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకున్నారని మంత్రి అచ్చెమనాయుడు అన్నారు. దానికి కారణం ఏటంటే స్వతంత్ర భారతదేశంలో అటు పార్లమెంట్ గాని రాజ్యసభ గాని దేశంలో అనేక ఇష్యూలు వచ్చాయని పేర్కొన్నారు. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా పార్లమెంట్లో చర్చ జరిగేటప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అనుకూలించినా, కొన్ని రాజ రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయని తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దు సమయంలో గాని ట్రిపుల్ తలాక్ విషయంలో గాని అయోధ్య రామ మందిర విషయంలో లేదావక్స్ బిల్ సవరణ విషయంలో రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. భారతదేశ చరిత్రలో ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు యునానిమస్ గా సహకరించాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో విషయంలో వ్యతిరేకించిన పార్టీ ఆ పార్టీ వైఎస్సార్ పార్టీనే నిలిచిందన్నారు.తెలుగు జాతి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎందుకంత కక్ష పెట్టుకున్నావుని ప్రశ్నించారు.
సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకుంటారన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకున్నా అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ సంప్రదించిన తర్వాతే ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నారన్నారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది మీ పార్టీలో నాయకులేనని దుయ్యబట్టారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. ఇప్పుడు వైసీపీ మండలి విపక నేత బొత్స సత్తిబాబు అప్పటి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాన్నారు. కనీసం మీకు ఆ రోజు జ్ఞానం ఉంటే రాష్ట్రాన్ని వీడదీసేవారు కాదన్నారు.రాష్ట్రానికి రాజధాని లేదు బిల్లులోనే ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి రాజధానిగా ప్రకటించాలి కానీ ప్రకటించకుండా రాజధాని విషయంలో కూడా ఆంధ్రరాష్ట్రంలో ప్రజలు కొట్టుకోవాలని చెప్పి కక్షపూర్తిగా వ్యవహరించారని అన్నారు.
అధికారం వచ్చింది ప్రభుత్వ బాధ్యతలు తీసుకుంది ప్రధానమైనరాజధాని ఎంపిక విషయంలో కూడా ప్రాంతాల మధ్య విభేదాలు ఉండకూడదు, వర్గాల మధ్య విభేదాలు ఉండకూడదు రాజకీయ పార్టీలు అన్నింటిని ఒక తాటిపైకి తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు. అందరి ఆమోద యోగ్యంతోనే అమరావతి రాజధాని నిర్మాణం కావాలని చంద్రబాబు బాబు నాయుడు గారు ఆ రోజు శాసన సభలో చర్చకు తీసుకొచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు.