బీ కేర్‌ఫుల్‌.. ఏపీ కూటమికి ఐదు రాష్ట్రాల ఎన్నికల వార్నింగ్‌! ఆ మూడు రాష్ట్రాల్లో మార్పు వెనుక అర్థమేంటి?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేవలం ఆయా రాష్ట్రాలకే పరిమితం కాలేదు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌పై కూడా వాటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి నేతల్లో ఒకవైపు తమ మిత్రపక్షాలు గెలిచాయన్న ఆనందం ఉన్నా, మరోవైపు ప్రజలు ఎప్పుడు ఎలా తీర్పునిస్తారో అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. తమిళనాడులో అందరూ ఊహించినట్లు డిఎంకే రావడం పక్కన పెడితే, సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) అనూహ్య విజయం సాధించడం ఏపీ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది.హామీలను అమలు చేస్తున్నాం.. చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నాం… ఆర్థికంగా భారమైన అడుగులు ముందుకే వేస్తున్నాం అన్నది ఏపీ కూటమి నేతల మాట.

 

ప్రధానంగా మూడు రాష్ట్రాలలో ప్రజలు మార్పు కోరుకోవడం ఏపీ ఎన్డీఏ నేతలను ఆలోచనలోకి నెట్టింది. అయితే వైసీపీ కి మళ్ళీ ఓటు వేయాలని మాత్రం భావిస్తోంది. ఇటువంటి ఆశ నిరాశల మధ్య ఉన్న ఏపీ ఎన్డీఏ నేతలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు తమకు అగ్ని పరీక్షేనని అనుకుంటున్నారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏపీ ఎన్డీఏ నేతల్లో మిశ్రమ స్పందన కల్పిస్తోంది. మూడు రాష్ట్రాల ప్రజలు మార్పు కోరుకుంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అందుకు భిన్నమని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ ఫలితాలతో ఏపీ కూటమి పార్టీలు అప్రమత్తమయ్యాయా..? మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోపాలను గుర్తించి సరిదిద్దుకోబోతున్నారా..? అంటే అవుననే సమాధానం కూటమి నేతల్లో వినిపిస్తుంది.

 

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ ఏపీ లోని ఎన్టీఏ కూటమిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేశాయి. అదేవిధంగా కేరళలో యూడిఎఫ్ కూటమి పశ్చిమ బెంగాల్లో బిజెపి అధికారంలోకి రావడం పుదుచ్చేరి, అస్సాంలో ఎన్డీఏ కూటమి గెలవడంపై ఏపీ కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నా.. లో లోపల మాత్రం ఆందోళన లేకపోలేదు. ప్రధానంగా మూడు పెద్ద రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకోవడం వెనక ఉన్న కారణాలను ఏపీలో కూటమి ప్రభుత్వం విశ్లేషిస్తోంది.

 

తమిళనాడులో డిఎంకే మళ్ళీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ సినీ హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే విజయం సాధించింది. సినీ గ్లామర్ తో పాటు కులం అధికార పార్టీ డిఎంకే పై ఉన్న వ్యతిరేకత టీవీకే గెలుపుకు ఒక కారణమని కూటమి విశ్లేషిస్తోంది. ఇదే సమయంలో డిఎంకే గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేకపోవడంతో ఓడిపోయిందని ఏపీ ఎన్డీఏ భావిస్తోంది. ప్రభుత్వంలో పెరిగిన అవినీతి ఎమ్మెల్యేల వ్యవహార శైలి ప్రజల్లో వ్యతిరేకతకు ప్రధాన కారణాలని అంచనా వేస్తోంది.

 

అక్కడ శాంతి భద్రతలపై ప్రజలు పెదవి విరిచారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న దీదీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ కారణాలన్నీ అధికారానికి దూరం చేశాయని చెబుతున్నాయి. కేరళలో ఎల్ డిఎఫ్ కూటమి పై వచ్చిన అవినీతి ఆరోపణలతో ప్రజలు మార్పు కోరుకున్నారని విశ్లేషిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న క్రమంలో రాబోయే మూడేళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని ఓ మంత్రి చెప్పారు.

ఇప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రాలకు ఏపీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆ శాసన సభ్యుడు చెప్పుకొచ్చారు. ఐదు రాష్ట్రాలఎన్నికల ఫలితాలు ఏపీలో కూటమి ప్రభుత్వానికి బీ కేర్ ఫుల్ అనే సంకేతాన్ని ఇచ్చాయి. అసంతృప్తులు విభేదాలను చక్కదిద్ది ముందుకు వెళ్లేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉన్న మూడు సంవత్సరాల చాలినంత సమయంని ఓ మంత్రి విశ్లేషించారు.
మొత్తం మీద కూటమిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒకవైపు ఆందోళన మరోవైపు ఆనందాన్ని తెచ్చిపెట్టాయి.

 

ఐదు రాష్ట్రాల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక ‘వేక్-అప్ కాల్’. అధికారంలోకి వచ్చి రెండు ఏళ్లు పూర్తయిన వేళ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూటమికి రిట్మస్ టెస్టుగా మారనున్నాయి. ప్రజలు కేవలం హామీలను వినడం లేదు, వాటి అమలును గమనిస్తున్నారు. ఒకవేళ లోపాలను సరిదిద్దుకోకపోతే, “ప్రజలు మార్పు కోరుకుంటే ఆ ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు” అన్నది ఈ ఫలితాల సారాంశం. ఏపీ కూటమి నేతలు ఈ ‘బీ కేర్‌ఫుల్’ సిగ్నల్‌ను ఎంతవరకు అందిపుచ్చుకుంటారో వేచి చూడాలి!