తెలంగాణ రాజకీయ యవనికపై మళ్లీ గులాబీ బాస్ విశ్వరూపం! మౌనం వీడితే మాటల తూటాలే.. అడుగు కదిపితే రాజకీయ భూకంపాలే! ఓటమి తర్వాత కేసీఆర్ చాప్టర్ క్లోజ్ అనుకున్న ప్రత్యర్థుల గుండెల్లో.. జగిత్యాల గడ్డపై జనసందోహాన్ని చూసి వణుకు మొదలైందా? దశాబ్దాల కాంగ్రెస్ కోటగా ఉన్న జగిత్యాలలో.. హస్తం పార్టీకి వెన్నెముక లాంటి సీనియర్ నేత జీవన్ రెడ్డిని తన గూటికి చేర్చుకోవడం ద్వారా కేసీఆర్ ఏం సంకేతాలు ఇచ్చారు.కేవలం ఒక చేరిక కాదు.. ఇది రేవంత్ సర్కార్‌పై ప్రకటించిన యుద్ధం! ఢిల్లీ పీఠాన్ని శాసిస్తున్న మోదీకి, గల్లీలో పాలన సాగిస్తున్న రేవంత్‌కు.. ఏకకాలంలో కేసీఆర్ సంధించిన ప్రశ్నలేంటి?
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు! కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు ఎక్కడం.. జగిత్యాల గడ్డపై గులాబీ బాస్ కేసీఆర్ గర్జించడం.. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. ఓటమి తర్వాత కాస్త మౌనంగా ఉన్న కేసీఆర్, ఈ సభలో చూపించిన ‘యాక్టివ్’ మూడ్ వెనుక ఉన్న వ్యూహమేంటి? రేవంత్ రెడ్డి, మోదీలను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన విమర్శల అంతరార్థం ఏమిటి? జగిత్యాల సభ పూర్తి విశ్లేషణను చూద్దాం.
జీవన్ రెడ్డి అంటే కేవలం ఒక మాజీ మంత్రి మాత్రమే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌కు ఉన్న ఒక పెద్ద దిక్కు. ఆయన పార్టీ మారడం కాంగ్రెస్‌కు నైతికంగా పెద్ద దెబ్బ. జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలే ఆయనను బీఆర్ఎస్ వైపు నడిపించాయి.ఉత్తర తెలంగాణలో పట్టు కోల్పోతున్న తరుణంలో, జీవన్ రెడ్డి వంటి అనుభవజ్ఞుడు రావడం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
జగిత్యాల సభ కేవలం ఒక చేరికల సభ కాదు.. అది కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంపై దెబ్బ. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోసిన జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత, కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడం వెనుక పెద్ద పొలిటికల్ డ్రామానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కలేదన్న అసంతృప్తిని కేసీఆర్ సరిగ్గా క్యాచ్ చేశారు. ఒకే దెబ్బకు ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేశారు. ఇది కేవలం ఒక నియోజకవర్గ మార్పు కాదు.. రాబోయే కాలంలో జరగబోయే భారీ వలసలకు ఇది ‘ట్రైలర్’ మాత్రమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
పాలన చేతకాక తిట్లు తిడుతున్నారు అంటూ రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. ముఖ్యంగా హామీల అమలు, రైతు రుణమాఫీ అంశాలపై గట్టిగా నిలదీశారు. అటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను, ఇటు కేంద్రంలో బీజేపీని సమానంగా ఢీకొట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇద్దరూ ఒకటే అన్న సంకేతాన్ని పంపారు. పాత కేసీఆర్‌ను గుర్తు చేస్తూ చాలా యాక్టివ్‌గా, చలోక్తులతో సభను రంజింపజేశారు. కేడర్‌కు నేనున్నాను అనే భరోసా కల్పించడమే ఈ సభ ప్రధాన ఉద్దేశంలా కనిపించింది.
సభలో కేసీఆర్ అదే పాత వాగ్ధాటి, అదే వ్యంగ్యం, అదే పదునైన విమర్శ. కేసీఆర్ స్పీచ్‌లో ఎక్కడా ఓటమి ఛాయలు కనిపించలేదు.నేను దిగనంత వరకే.. నేను దిగితే లెక్కలు మారుతాయి అన్న సంకేతాన్ని కేసీఆర్ పంపారు. నిరాశలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈ సభ ఒక ‘బూస్టర్ డోస్’ లా పనిచేసింది.జగిత్యాల ప్రజలతో ఉన్న పాత అనుబంధాన్ని గుర్తు చేస్తూనే, ప్రస్తుత పాలనలోని లోపాలను ఎండగట్టడం ఆయన చాణక్యతకు నిదర్శనం
సీఎం రేవంత్ రెడ్డిని అనుభవలేమి నేతగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇచ్చిన గ్యారెంటీలు ఏమయ్యాయి? రైతుల గోస పట్టదా? అంటూ సూటిగా ప్రశ్నించడం ద్వారా సామాన్య ప్రజల సెంటిమెంట్‌ను టచ్ చేశారు. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా, ప్రధాని మోదీ విధానాలను కూడా ఎండగట్టారు. తద్వారా బీఆర్ఎస్ అంటే కేవలం రీజినల్ పార్టీ కాదు, నేషనల్ లెవల్‌లో గొంతుకని మరోసారి గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకే నాణేనికి రెండు ముఖాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, ‘తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ మాత్రమే’ అనే నినాదాన్ని బలపరిచారు.
జగిత్యాల ఎప్పుడూ తెలంగాణ ఉద్యమానికి గట్టి పునాది. ఇక్కడి నుంచే మళ్లీ పార్టీని పుంజుకునేలా చేయాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. భారీగా జనం తరలిరావడం చూస్తుంటే, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని బీఆర్ఎస్ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. మున్సిపల్ లేదా ఇతర ఉపఎన్నికలు ఏవైనా వచ్చినా, పార్టీ సిద్ధంగా ఉందని చాటిచెప్పడమే ఈ సభ లక్ష్యం.రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. కేసీఆర్ తన ‘సెకండ్ ఇన్నింగ్స్’ను చాలా పక్కాగా ప్లాన్ చేశారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, కాంగ్రెస్ నుంచి గట్టి నేతలను లాగడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపరిచే వ్యూహం అమలు చేస్తున్నారు.
మొత్తానికి.. జగిత్యాల సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక ‘టర్నింగ్ పాయింట్’. కేసీఆర్ ఇంకా ఫామ్‌లోనే ఉన్నారని, ఆయన రాజకీయ చాణక్యం ఏమాత్రం తగ్గలేదని ఈ సభ స్పష్టం చేసింది.జీవన్ రెడ్డి రూపంలో ఒక భారీ వికెట్‌ను పడగొట్టిన కేసీఆర్.. రాబోయే రోజుల్లో గాంధీ భవన్‌లో ఇంకెన్ని ఖాళీలు చేయబోతున్నారో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవైపు రేవంత్ రెడ్డి దూకుడు, మరోవైపు బీజేపీ విస్తరణ కాంక్ష.. వీటి మధ్య ‘సింహం’లా కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి రావడం రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.ధికార పక్షానికి ఇది హెచ్చరిక.. విపక్షాలకు ఇది సవాల్! జగిత్యాల గర్జన.. జైత్రయాత్రగా మారుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.